ఆర్టీసీ సమ్మె... వారంతా ఏమయ్యారన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే

ఆర్టీసీ సమ్మె ఇంకా ఎన్ని రోజులు జరుగుతుందో తెలియడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సమస్య పరిష్కారం చేయడం లేదని అన్నారు.

news18-telugu
Updated: November 13, 2019, 1:04 PM IST
ఆర్టీసీ సమ్మె... వారంతా ఏమయ్యారన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే
జగ్గారెడ్డి, కేసీఆర్
  • Share this:
సీఎం కేసీఆర్ పరిపాలనలో ఇంతమంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వానికి సిగ్గు అనిపించడం లేదా.? అని మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తెలంగాణ వస్తే ఆత్మహత్యలు ఉండవు అని సీఎం కేసీఆర్ పలు సందర్భాలలో మాట్లాడారని ఆయన గుర్తు చేశారు. 40 రోజులు ఆర్టీసీ సమ్మె జరగడం ఇదే మొదటి సారి అని అన్నారు. ఆర్టీసీ సమ్మె ఇంకా ఎన్ని రోజులు జరుగుతుందో తెలియడం లేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సమస్య పరిష్కారం చేయడం లేదని జగ్గారెడ్డి అన్నారు. తక్కువ జీతాలు ఉన్న ఆర్టీసీ కార్మికులు అనారోగ్యకరణలతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

ఆవుల నరేష్ అనే ఆర్టీసీ కార్మికుడు ఉదయం ఆత్మహత్య చేసుకున్నారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఉద్యమాలకు రాష్ట్రంలో విలువలేకుండా పోయిందని విమర్శించారు. కళ్ళుండి చూడలేని గుడ్డి ప్రభుత్వం ఇది అని జగ్గారెడ్డి అన్నారు. చనిపోయిన కార్మికులను ఎవరు ఆదుకోవాలని ప్రశ్నించారు. అధికారులు చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేయాలని అన్నారు. బలహీనుడికి బలవంతునికి జరుగుతున్న పోరాటం...భగవంతుడు ఎవరిని గెలిపిస్తాడో చూద్దామని జగ్గారెడ్డి అన్నారు.

రాష్ట్రం ఆత్మహత్యల తెలంగాణగా మారిందని, గుండెపోటు తెలంగాణగా మారిందని ధ్వజమెత్తారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే... NGO ఉద్యోగ సంఘాల నాయకులు కనపడటం లేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. స్వామి గౌడ్ ,మమత,రవీందర్ ,దేవీప్రసాద్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏమయ్యారని ప్రశ్నించారు. ఆర్టీసీ ఉద్యోగులు సమస్యపై మాట్లాడకుండా... ప్రభుత్వానికి చెంచా గిరి చేసుకుంటూ బతుకుతున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు.First published: November 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...