ఆ పదవి కావాలి.. పైరవీలు చేయను.. అప్పటి నుంచే రాజకీయాలన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే

Jaggareddy: తాను నిక్కర్లు వేసుకున్నప్పటి నుండే రాజకీయాలు మొదలుపెట్టానని జగ్గారెడ్డి అన్నారు.

news18-telugu
Updated: August 10, 2020, 2:35 PM IST
ఆ పదవి కావాలి.. పైరవీలు చేయను.. అప్పటి నుంచే రాజకీయాలన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే
జగ్గారెడ్డి (File- credit - twitter)
  • Share this:
తాను కూడా టీపీసీసీ చీఫ్ రేసులో ఉన్నానని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఇందుకోసం రాహుల్, సోనియాగాంధీ లకు లేఖ పంపానని అన్నారు. పీసీసీ మార్పు జరిగితే తనకు అవకాశం ఇవ్వాలని కోరినట్టు చెప్పారు. అయితే టీపీసీసీ పదవి కోసం ఢిల్లీకి వెళ్లి మాత్రం పైరవీ చేయలేనని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. తనకు టీపీసీసీ చీఫ్ పదవి ఇస్తే.. సీనియర్ నాయకుల సహకారంతో పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని అన్నారు. మండల, జిల్లా స్థాయి వరకు సమయం ఇచ్చి తిరుగుతానని తెలిపారు. తన వ్యాఖ్యలతో కొందరు కన్ఫ్యూజ్ అవుతున్నారని జగ్గారెడ్డి కామెంట్ చేశారు. తన ప్రతి మాట వ్యూహాత్మకంగానే ఉంటుందని చెప్పారు.

తన వ్యక్తిత్వం కొందరికి తెలియక తనను టీఆర్ఎస్ ఏజెంట్ అని సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ గురించి ఎవరూ మాట్లాడని రోజుల్లోనే నేను విమర్శలు చేశానని అన్నారు. కానీ చాలామంది ఇప్పుడు ఫేస్ బుక్‌లో కేసీఆర్ మీద మాట్లాడుతున్నారని ఆరోపించారు. తాను నిక్కర్లు వేసుకున్నప్పటి నుండే రాజకీయాలు మొదలుపెట్టానని జగ్గారెడ్డి అన్నారు. ఫేస్‌బుక్ పిచ్చోళ్ళకు కొందరు లీడర్స్ పైసలు ఇచ్చి మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు.
Published by: Kishore Akkaladevi
First published: August 10, 2020, 2:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading