Home /News /politics /

CONGRESS MLA JAGGAREDDY COMMENTS ON ETELA RAJENDAR WHO IS GOING TO JOIN BJP SOON AK MDK

Etela Rajendar: అవి మా దగ్గర ఉండుంటే.. ఈటలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

ఈటల రాజేందర్(ఫైల్ ఫొటో)

ఈటల రాజేందర్(ఫైల్ ఫొటో)

Jaggareddy: ప్రస్తుతం ఈటలపై తెలంగాణ పోలీసులు కేసులు పెట్టారని, అందువల్ల ఆయనకు ఢిల్లీ హోం శాఖ అవసరం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు.

    తెలంగాణ మంత్రివర్గం నుంచి బహిష్కరణకు గురైన మాజీమంత్రి ఈటల రాజేందర్ త్వరలోనే బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన బీజేపీలోకి వెళ్లడం దాదాపు ఖాయం కావడంతో.. ఆయన చేరిక వల్ల రాష్ట్రంలో బీజేపీ ఏ మేరకు బలపడుతుందనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈటల రాజేందర్ బీజేపీలోకి వెళ్లడంపై సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండి.. తమ దగ్గర హోం శాఖ ఉంటే ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలోనే చేరేవాడని జగ్గారెడ్డి కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈటల రాజేందర్‌కు కేంద్ర హోంశాఖ, ఈడీ, ఇన్‌కాం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ల సహాయం కావాలని అన్నారు. ప్రస్తుతం అవి కాంగ్రెస్ దగ్గర లేనందునే ఈటల బీజేపీలో చేరుతున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బలమైందన్న జగ్గారెడ్డి, ఈటల బలహీనుడని అన్నారు. ఒకవేళ ఈటలకు పోరాటం చేయాలనే ఆలోచన ఉండి ఉంటే ఆయన కాంగ్రెస్ దగ్గరికి వచ్చే వాడని జగ్గారెడ్డి అన్నారు. ప్రస్తుతం ఈటలపై తెలంగాణ పోలీసులు కేసులు పెట్టారని, అందువల్ల ఆయనకు ఢిల్లీ హోం శాఖ అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Etela rajender, Jagga Reddy, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు