వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. వీడియో వైరల్

ఎమ్మెల్యేతో పాటు అనుచరులు, స్థానికులు ఏరును దాటుతుండగా.. ప్రమాదవశాత్తు ఆయన నీటిలో పడిపోయారు. అలాగే ముందుకు వెళ్తుండంతో అప్రమత్తమైన సిబ్బంది ఆయన్ను కాపాడి ఒడ్డుకు చేర్చారు.

news18-telugu
Updated: July 31, 2020, 11:21 AM IST
వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే..  వీడియో వైరల్
వరద ప్రవాహంలో పడిపోయిన ఎమ్మెల్యే
  • Share this:
దేశమంతటా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల వాహనాలు కొట్టుకుపోయిన ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఐతే ఉత్తరాఖండ్‌లో ఏకంగా ఎమ్మెల్యేనే వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఏరు దాటే క్రమంలో అదుపుతప్పి నీటిలో పడిపోవడంతో ప్రవాహంతో పాటు వెళ్లిపోయారు. వెంటనే అప్రమత్తమైన సహాయక సిబ్బంది, స్థానికులు ఆయన్ను కాపాడారు. స్వల్ప గాయాలతో ఆయన బయటపడ్డారు. ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హరిధామి దార్చుల్లా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భారీ వర్షాలు కురవడంతో దార్చుల్లాలోని పలు ప్రాంతాల్లో నీట మునిగాయి. మారుమూల ప్రాంతాల్లోని వరద బాధితులను పరామర్శించేందుకు గురువారం ఆయన వెళ్లారు. పలు ప్రాంతాల్లో తిరిగిన ఆయన అనంతరం లుమ్తీ గ్రామానికి బయలుదేరారు. ఆ ఊరికి వెళ్లాలంటే ముందు వరద ప్రవాహాన్ని దాటాలి. ఈ క్రమంలో ఎమ్మెల్యేతో పాటు అనుచరులు, స్థానికులు ఏరును దాటుతుండగా.. ప్రమాదవశాత్తు ఆయన నీటిలో పడిపోయారు. అలాగే ముందుకు వెళ్తుండంతో అప్రమత్తమైన సిబ్బంది ఆయన్ను కాపాడి ఒడ్డుకు చేర్చారు.


అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. వరదలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయని చెప్పారు. కొండప్రాంతాల నుంచి కొట్టుకువస్తున్న చెత్తాచెదారం, వరద నీటితో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతున్నా బీజేపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లతో లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన డిమాండ్ చేశారు.
Published by: Shiva Kumar Addula
First published: July 31, 2020, 11:16 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading