news18-telugu
Updated: November 20, 2019, 1:18 PM IST
కాంగ్రెస్ ఎమ్మెల్యే తారా ప్రసాద్
సాధారణంగా అసెంబ్లీ అంటేనే... వాదోపవాదాలు. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు సభ వేదికగా కూడా విమర్శలు చేసుకుంటుంటారు. అధికార పార్టీ తీరును ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఎండగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటుంది. సాధారణంగా ఏ రాష్ట్ర అసెంబ్లీలో అయినా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తాయి. కానీ ఒడిశా అసెంబ్లీలో మాత్రం ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. శాసనసభ సమావేశాల సందర్భంగా స్పీకర్ ఎస్ఎన్ పాత్రోకు... కాంగ్రెస్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహినీపతి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా సభలో ఉన్న సభ్యులంతా షాక్ అయ్యారు. ఆ తర్వాత ఈ సన్నివేశాన్ని చూసి ఎమ్మెల్యేలంతా మనసారా నవ్వుకున్నారు. అయితే ఈ ఘటనపై ఎమ్మెల్యే తారా ప్రసాద్ సభ బయట స్పందించారు. తన నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించేందుకు అవకాశం కల్పించినందుకే స్పీకర్‌కు కృతజ్ఞత భావంతోనే ఫ్లయింగ్ కిస్ ఇచ్చామన్నారు. ఇందులో మరేలాంటి దురుద్దేశం లేదన్నారు. ఈ సందర్భంగా తన నియోజకవర్గంలో నెలకొన్న మంచి నీటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు ఎమ్మెల్యే.
Published by:
Sulthana Begum Shaik
First published:
November 20, 2019, 1:18 PM IST