ఎన్‌ఆర్‌సీని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో కాంగ్రెస్ 'భారత్ బచావో' ర్యాలీ..

మధ్యాహ్నం 2.30గంటలకు రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించే ఈ ర్యాలీకి కనీసం లక్ష మంది జనాన్ని సమీకరించాలని నిర్ణయించారు.

news18-telugu
Updated: December 14, 2019, 12:12 PM IST
ఎన్‌ఆర్‌సీని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో కాంగ్రెస్ 'భారత్ బచావో' ర్యాలీ..
రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ శ్రేణులు
  • Share this:
కాంగ్రెస్ పార్టీ శనివారం ఢిల్లీలో 'భారత్ బచావో ర్యాలీ' చేపట్టనుంది. బీజేపీ నియంత్రుత్వాన్ని వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ నిర్వహించనుంది. పౌరసత్వ సవరణ చట్టంపై వస్తున్న వ్యతిరేకత,ఆర్థిక మందగమనం,రైతు సమస్యలు, నిరుద్యోగం వంటి సమస్యలపై ర్యాలీలో నిరసన తెలపనున్నారు. కాంగ్రెస్ నిర్వహించే ఈ ర్యాలీలో ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు.మధ్యాహ్నం 2.30గంటలకు రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించే ఈ ర్యాలీకి కనీసం లక్ష మంది జనాన్ని సమీకరించాలని నిర్ణయించారు. ఈ మేరకు యూపీ,ఢిల్లీ,పంజాబ్,హర్యానాల నుంచి జనాన్ని తరలించాలని..ఆయా రాష్ట్రాల నాయకత్వానికి ఆదేశాలు వెళ్లాయి. ఆయా రాష్ట్రాల నుంచి తరలివచ్చే నాయకత్వాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఢిల్లీ విమానాశ్రయాలు,రైల్వే స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక రామ్ లీలా మైదానంలో ఇప్పటికే వేదికను కూడా సిద్దం చేశారు. వేదిక నుంచి 10కి.మీ పరిధిలో జాతీయ జెండా,ఫ్లెక్సీలు,బ్యానర్లతో నింపేశారు.

First published: December 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు