కాంగ్రెస్ సరికొత్త వ్యూహం...రాజ్యసభకు ప్రియాంక గాంధీ?

ఇప్పటికే లోక్‌సభలో రాహుల్ గాంధీ బీజేపీపై విమర్శలు దాడి చేస్తుండగా...రాజ్యసభలో ప్రియాంక గాంధీ అయితే బీజేపీని డిఫెన్స్‌లోకి నెట్టవచ్చని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు.

news18-telugu
Updated: February 16, 2020, 6:11 PM IST
కాంగ్రెస్ సరికొత్త వ్యూహం...రాజ్యసభకు ప్రియాంక గాంధీ?
ప్రియాంక గాంధీ
  • Share this:
కేంద్రంలోని అధికార బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ హైకమాండ్ సరికొత్త వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా ప్రియాంక గాంధీని రాజ్యసభకు పంపే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే లోక్‌సభలో రాహుల్ గాంధీ బీజేపీపై విమర్శలు దాడి చేస్తుండగా...రాజ్యసభలో ప్రియాంక గాంధీ అయితే బీజేపీని డిఫెన్స్‌లోకి నెట్టవచ్చని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. బీజేపీని పార్లమెంటు ఉభయ సభల్లో సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే రెండు వైపులా పదునున్న కత్తి అవసరమని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు ఆ పార్టీ నేత ఒకరు చెప్పారు.  రాజ్యసభలో ప్రస్తుతం ప్రాతినిధ్యంవహిస్తున్న కాంగ్రెస్ సీనియర్లను పక్కనబెట్టి...కొత్త రక్తాన్ని బరిలోకి దించాలని పార్టీ అధిష్టానానికి ఆ పార్టీ నేతలు సూచిస్తున్నారు.

రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యంవహిస్తున్న పార్టీ సినియర్లు అంబికా సోని, గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్ తదితరుల పదవీకాలం త్వరలో ముగియనుంది. ఛత్తీస్‌గఢ్,రాజస్థాన్, జార్ఖండ్‌ల నుంచి ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో వీరినే మళ్లీ రాజ్యసభకు పంపుతారా? కొత్త వారికి అవకాశం ఇస్తారా? అన్న అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిరేపుతోంది. ఛత్తీస్‌గఢ్ నుంచి ప్రియాంక గాంధీని రాజ్యసభకు పంపాలని అక్కడి కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు.

priyanka gandhi rajya sabha, priyanka gandhi vadra, priyanka gandhi age, priyanka gandhi news, aicc news, congress news, ప్రియాంక గాంధీ రాజ్యసభ, ప్రియాంక గాంధీ ఫోటోలు
ప్రియాంక గాంధీ, గులాం నబీ ఆజాద్, రాహుల్ గాంధీ(ఫైల్ ఫోటో)


యూపీలో కాంగ్రెస్ బలోపేతంపై ప్రియాంక గాంధీ ఇప్పటికే ఫోకస్ పెట్టారు. ఆమెను రాజ్యసభకు పంపితే రాజకీయంగా ప్రియాంక గాంధీ బలపడుతారా? బలహీనపడుతారా? అంశంపై కాంగ్రెస్ పెద్దలు బేరిజు వేసుకుంటున్నారు. దీనికి అనుగుణంగా ప్రియాంక గాంధీని రాజ్యసభకు పంపే విషయంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. సీనియర్లలో గులాం నబీ ఆజాద్‌ను మళ్లీ రాజ్యసభకు పంపే అవకాశముంది. కాంగ్రెస్ పార్టీ నేతలు జ్యోతిరాదిత్య సింథియా, కరుణా శుక్లా, రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా, భూపిందర్ సింగ్ హూడా తదితరులు రాజ్యసభ సీట్లు ఆశిస్తున్న వారిలో ఉన్నారు.

First published: February 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు