చంద్రబాబుకు కాంగ్రెస్ షాక్ ఇస్తుందా... టీడీపీలో టెన్షన్

ఏపీలో ఈసారి వైసీపీకి అత్యధిక లోక్ సభ స్థానాలు వస్తాయని సర్వేలు అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ కూటమిలో వైసీపీని చేర్చుకునేందుకు తమవంతు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: May 17, 2019, 1:56 PM IST
చంద్రబాబుకు కాంగ్రెస్ షాక్ ఇస్తుందా... టీడీపీలో టెన్షన్
ధర్మపోరాట దీక్షలో రాహుల్, చంద్రబాబు(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: May 17, 2019, 1:56 PM IST
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనే విషయం అందరికీ తెలిసిందే. రాజకీయాల్లో అవసరాలే తప్ప... ఇతర అంశాలకు నేతలు పెద్దగా ప్రాధాన్యం ఇచ్చే రోజులు ఎఫ్పుడో పోయాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తమను అవసరానికి వాడుకుని వదిలేస్తుందా అనే ఆందోళన టీడీపీలో మొదలైందని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కొన్ని నెలలుగా జాతీయస్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, టీడీపీ కలిసి పోరాటం చేస్తున్నాయి. ఎన్నికల తరువాత కాంగ్రెస్ కూటమితో కలిసి పని చేయడానికి సిద్ధమవుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు... ఇందుకోసం మిగతా ప్రాంతీయ పార్టీలతోనూ చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే.

చంద్రబాబు వ్యూహాలు ఎలా ఉన్నా... జాతీయస్థాయిలో బీజేపీని గద్దె దించేందుకు అవసరమైన సంఖ్యాబలం సమకూర్చుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలోనే ఆ పార్టీ ఎన్నికల ఫలితాలు రానున్న మే 23న ప్రాంతీయ పార్టీలను చర్చలకు ఆహ్వానించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి ఆహ్వనం వెళ్లిన పార్టీల జాబితాలో ఏపీలోని ప్రతిపక్ష వైసీపీ కూడా ఉందనే అంశం ఇప్పుడు టీడీపీ వర్గాల్లో టెన్షన్‌కు కారణమవుతోందని ఊహాగానాలు జోరందుకున్నాయి. ఏపీలో ఈసారి వైసీపీకి అత్యధిక లోక్ సభ స్థానాలు వస్తాయని ప్రీ పోల్ సర్వేలు అంచనా వేశాయి.

ఎన్నికలు పూర్తయిన తరువాత కూడా గెలుపు వైసీపీ వైపే ఉంటుందనే టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ కూటమిలో వైసీపీని చేర్చుకునేందుకు తమవంతు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ వైసీపీని కలుపుకుని వెళ్లడం టీడీపీకి ఏ మాత్రం మింగుడుపడని విషయం. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు అన్నట్టు... రాష్ట్రంలో ప్రత్యర్థులుగా ఉన్న టీడీపీ, వైసీపీ జాతీయస్థాయిలో ఒకే కూటమిలో ఉండటం దాదాపు అసాధ్యం.

టీడీపీ, వైసీపీల్లో ఎవరి మద్దతు తీసుకోవాలనే అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి వస్తే... అత్యధిక ఎంపీ సీట్లు వస్తాయనే ప్రచారం జరుగుతున్న వైసీపీ వైపే ఆ పార్టీ మొగ్గు చూపే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఇక కాంగ్రెస్ కూటమి నుంచి టీడీపీ సైడైపోవాల్సిందే. ఏపీలో మరోసారి రీ పోలింగ్‌పై ఈసీకి ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ వెళుతున్న చంద్రబాబు... వైసీపీకి కాంగ్రెస్ ఆహ్వానంపై కూడా ఆ పార్టీతో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...