GHMC Elections: కాంగ్రెస్ మేనిఫెస్టోలో వరాల తుఫాన్.. వరద బాధితులకు రూ.50వేలు, ఇంకా

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో పార్టీ నేతలు మేనిఫెస్టోను రిలీజ్ చేశారు.

news18-telugu
Updated: November 24, 2020, 2:02 PM IST
GHMC Elections: కాంగ్రెస్ మేనిఫెస్టోలో వరాల తుఫాన్.. వరద బాధితులకు రూ.50వేలు, ఇంకా
ప్రతీకాత్మక చిత్రం
 • Share this:
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో పార్టీ నేతలు మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. అధికార టీఆర్ఎస్ పార్టీనిమించి ఉచిత హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. వరద బాధితులకు రూ.50వేల సాయం ఇస్తామని హామీ ఇచ్చింది. పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.5 లక్షలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.2.5 లక్షలు ఇస్తామని తెలిపింది. వరదల్లో చనిపోయిన ప్రతి వ్యక్తి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ప్రకటించింది. జపాన్, హాంకాంగ్, స్పెయిన్ వంటి దేశాల్లో ఉన్న నీటిపారుదల వ్యవస్థను హైదరాబాద్‌లో అమలు చేస్తామని హామీ ఇచ్చింది.

మేనిఫెస్టోలో ఇతర ముఖ్యాంశాలు


 • ఆరోగ్య శ్రీ పరిధిలోకి కోవిడ్ 19 చికిత్స, బస్తీ దవాఖానాలు 450కి పెంపు, ప్రతి 100 ఆస్పత్రులకు ఒక మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి

 • మహిళలు, విద్యార్థులు, దివ్యాంగులు, వృద్ధులకు ఆర్టీసీ బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్‌లో ఉచిత రవాణా. మెట్రో, ఎంఎంటీఎస్ విస్తరణ.

 • కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల కంట్రోల్. 150 డివిజన్లలో రీడింగ్ రూమ్‌లు, ఈ- లైబ్రరీలు. దివ్యాంగులకు లైబ్రేరియన్ ఉద్యోగాలు

 • అర్హత కలిగిన పేదలకు డబుల్ బెడ్రూ ఇళ్లు, ఇంటి స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి రూ.8లక్షలు. సింగల్ బెడ్ రూమ్‌ఉంటే మరో గది నిర్మాణానికి రూ.4లక్షల సాయం. ఇల్లు చేతికి అందించేందుకు వారు అద్దె ఇంట్లో ఉండేందుకు రూ.60,000 సాయం


 • రూ.50,000 వరకు ఆస్తిపన్ను రాయితీ. ఆస్తిపన్ను హేతుబద్ధీకరణ, డబుల్ బెడ్రూం ఇళ్లకు, మురికివాడల్లో ఇళ్లకు ఆస్తిపన్ను రద్దు

 • జీహెచ్ఎంసీలో 100 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించేవారికి రాయితీ

 • లాక్ డౌన్ కాలానికి ఆస్తిపన్ను, మోటారు వాహనాల పన్ను, విద్యుత్ బిల్లులు రద్దు. ఇప్పటికే బిల్లులు చెల్లిస్తే తర్వాత బిల్లుల్లో సర్దుబాటు

 • 80 గజాల కంటే తక్కువ స్థలంలో ఇల్లు ఉంటే ఆస్తిపన్ను రద్దు

 • క్షురకులు, రజకులు, వడ్రంగులు, విశ్వకర్మలు చెందిన దుకాణాలకు ఆస్తిపన్నుతో పాటు విద్యుత్ బిల్లులు మాఫీ. అన్ని అనుమతులు ఫ్రీ.

 • మాజీ సైనికోద్యోగులు, ప్రాణాలు కోల్పోయిన సైనికుల భార్య (వితంతువులు), అవయవాలు కోల్పోయిన సైనికులకు ఆస్తిపన్నులో 75 శాతం రాయితీ

 • ఎలాంటి చార్జీలు లేకుండానే ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ అమలుకు కృషి. ధరణి పోర్టల్ రద్దుకు కృషి

 • 30,000 లీటర్ల వరకు ఉచిత మంచినీరు, ఉచితంగా నల్లా కనెక్షన్

 • కోవిడ్‌ 19తో దెబ్బతిన్న వర్గాలకు నిరుద్యోగ అలవెన్సులు

 • ఏడాదిలో మూసీ నదుల ప్రక్షాళన, మురికివాడల అభివృద్ధికి ప్రత్యేక అథారిటీ ఏర్పాటు.

 • 2021 నాటికి సమగ్రమైన సీవరేజ్ వ్యవస్థ, 2022 నాటికి చెత్తరహిత హైదరాబాద్.

 • సఫాయి కర్మచారీలు, వారి కుటుంబాలకు రూ.25లక్షల బీమా
  నగరంలో అన్నపూర్ణ క్యాంటీన్‌లు పెంపు

 • సింగల్ స్క్రీన్ ధియేటర్లకు పన్ను తగ్గింపు, మాల్స్, మల్టీప్లెక్స్‌ల్లో సినిమా టికెట్ల ధరల నియంత్రణ, మాల్స్, మల్టీప్లెక్స్‌ల్లో విక్రయించే ధరలు ఎమ్మార్పీకే. షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌ల్లో పార్కింగ్ అంతా జీహెచ్ఎంసీ పరిధిలోకి

 • వృద్ధుల కోసం ఓల్డేజ్ హోమ్స్ ఏర్పాటు

 • ఏ సర్కిల్‌లో వసూలు చేసిన పన్నులు ఆ సర్కిల్‌లోనే అభివృద్ధికి ఖర్చు

 • ఔటర్ రింగ్ రోడ్డు లోపల కొత్త సెక్రటేరియట్ నిర్మాణం

Published by: Ashok Kumar Bonepalli
First published: November 24, 2020, 1:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading