రాజ్యాంగపరంగానే పార్టీ మారాం...టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల స్పష్టీకరణ

మూడింట రెండొంతల మంది ఎమ్మెల్యేలు కోరుకుంటే శాసనసభాపక్షం విలీనం కావొచ్చని రాజ్యాంగంలో స్పష్టంగా టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ విషయంలో స్పీకర్ కూడా రాజ్యాంగానికి లోబడే నిర్ణయం తీసుకున్నారని అన్నారు.

news18-telugu
Updated: June 12, 2019, 12:53 PM IST
రాజ్యాంగపరంగానే పార్టీ మారాం...టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల స్పష్టీకరణ
టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీడియా సమావేశం
news18-telugu
Updated: June 12, 2019, 12:53 PM IST
తాము రాజ్యాంగపరంగానే పార్టీ మారామని కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడారు. మూడింట రెండొంతల మంది ఎమ్మెల్యేలు కోరుకుంటే శాసనసభాపక్షం విలీనం కావొచ్చని రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని వారు తెలిపారు. ఈ విషయంలో స్పీకర్ కూడా రాజ్యాంగానికి లోబడే నిర్ణయం తీసుకున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోని గ్రూపు రాజకీయాల వల్ల తాము విసిగిపోయామని ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసమే పార్టీ మారామని అన్నారు.

కాంగ్రెస్ నేతలు తమపై ప్రజలు ఎందుకు నమ్మకం కోల్పోతున్నారనే అంశంపై దృష్టి పెట్టకుండా... ఇలాంటి విషయాలపై దృష్టి పెట్టడం సరికాదని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ అఖండ విజయం ద్వారా తాము తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు కూడా ఆమోదించారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు అనేక రాష్ట్రాల్లో ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను తమ పార్టీలో చేర్చుకున్నారనే విషయాన్ని గుర్తు చేశారు. తాము అమ్ముడుపోయామని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నేతలపై మండిపడ్డ ఎమ్మెల్యేలు... ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఈ అంశంపై కాంగ్రెస్ నేతలు కోర్టును ఆశ్రయించడంపై స్పందించిన ఎమ్మెల్యేలు... తాము కూడా కోర్టులో దీనిపై పోరాడతామని అన్నారు.

First published: June 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...