సూపర్‌స్టార్ రజనీకాంత్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్

రజనీకాంత్‌ ఆధ్యాత్మికత విషయంలో కాస్త కన్ ఫ్యూజ్ అయ్యారంటూ ఎద్దేవా చేశారు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ సభ్యుడు కేఎస్ అళగిరి.

news18-telugu
Updated: August 13, 2019, 11:00 AM IST
సూపర్‌స్టార్ రజనీకాంత్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్
రజనీకాంత్‌కు కాంగ్రెస్ కౌంటర్
  • Share this:
జమ్ముకాశ్మీర్‌లో ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తాజాగా సూపర్ స్టార్ రజనీ కాంత్ స్పందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలపై రజనీ ప్రశంసల వర్షం కురిపించారు. మోడీ-షా లను కృష్ణార్జునులతో పోల్చారు. అయితే రజనీ వ్యాఖ్యలపై తాజాగా తమిళనాడు కాంగ్రెస్ నేతలు స్పందించారు. రజనీకాంత్‌ ఆధ్యాత్మికత విషయంలో కాస్త కన్ ఫ్యూజ్ అయ్యారంటూ ఎద్దేవా చేశారు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ సభ్యుడు కేఎస్ అళగిరి.  మోదీ, అమిత్ షా ప్రజల హక్కుల్ని కొల్లగొట్టిన ... దుర్యోధనుడు, శకుని లాంటివారని విమర్శలు గుప్పించారు. కృష్ణా అర్జునుడిలాంటి వారు కానే కాదన్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి పి. చిదంబరం కూడా ఆర్టికల్ 370 రద్దుపై మండిపడ్డారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి హోదాను కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన నరేంద్ర మోదీ సర్కార్‌పై చిదంబరం ఆగ్రహం వ్యక్తంచేశారు. కశ్మీర్‌లో కేవలం ముస్లింల ఆధిపత్యం అధికంగా ఉన్నందుకే బీజేపీ అక్కడ ఆర్టికల్ 370ని రద్దు చేసిందని, అలా కాకుండా ఒకవేళ కశ్మీర్‌లో హిందువుల జనాభా అధికంగా ఉండి ఉంటే బీజేపి ఆ అధికరణం జోలికే వెళ్లేది కాదని పి చిదంబరం ఆరోపించారు.

ఆర్టికల్ 370 రద్దు బిల్లుపై పార్లమెంటులో షా అద్భుతమైన ప్రసంగం ఇచ్చారని తాజాగా రజనీ కితాబిచ్చారు. చెన్నైలో మీడియాతో మాట్లాడిన రజనీకాంత్.. ఆర్టికల్ 370 రద్దుపై ఈ కామెంట్స్ చేశారు. అమిత్ షాకి కంగ్రాట్స్ కూడా చెప్పారు. ''మిషన్ కశ్మీర్ సక్సెస్ అయినందుకు అమిత్ షా కి నా హృదయపూర్వక అభినందనలు. పార్లమెంటులో షా ఇచ్చిన స్పీచ్ ఫెంటాస్టిక్. మోడీ-షా.. కృష్ణుడు-అర్జునుడు వంటి జోడీ. వారిలో ఎవరు కృష్ణుడు, ఎవరు అర్జునుడో వారికే తెలుసు. షా కి, దేశానికి గుడ్ లక్ చెబుతున్నా'' అని రజనీకాంత్ అన్నారు.

 

First published: August 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు