HOME »NEWS »POLITICS »congress leaders revanth reddy and komatireddy venkat reddy reaches delhi to lobby for tpcc post in telangana ak

Revanth Reddy Vs KomatiReddy Venkat Reddy: రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఢిల్లీకి చేరిన టీపీసీసీ చీఫ్ పంచాయతీ

Revanth Reddy Vs KomatiReddy Venkat Reddy: రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఢిల్లీకి చేరిన టీపీసీసీ చీఫ్ పంచాయతీ
రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(పైల్ ఫోటో)

Revanth Reddy Vs KomatiReddy Venkat Reddy: టీపీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ పడుతున్న రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇద్దరూ ఢిల్లీ బాట పట్టి లాబీయింగ్ మొదలుపెట్టడంతో.. ఈ పదవి ఎవరికి దక్కుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది.

  • Share this:
    తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ పంచాయతీ ఢిల్లీకి చేరుకుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియను చేపట్టిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్.. ఇటీవలే రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతల నుంచి అభిప్రాయాలు సేకరించారు. మూడు నాలుగు రోజుల పాటు ఈ ప్రక్రియ చేపట్టి ఢిల్లీకి వెళ్లిపోయారు. ఇక దీనిపై ఢిల్లీ నుంచే ఓ ప్రకటన రావాల్సి ఉన్న తరుణంలో పీసీసీ చీఫ్ పదవి ఆశిస్తున్న నేతలు హస్తిన బాట పట్టారు. ముందుగా టీపీసీసీ చీఫ్ పదవి తనకు ఇవ్వాల్సిందే అని కోరుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కొద్దిసేపటి క్రితం సోనియాగాంధీతో సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీ పరిస్థితుల గురించి వివరించారు.

    టీపీసీసీ చీఫ్ పదవి తనకు ఇవ్వాలని ఆయన సోనియా గాంధీకి విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు టీపీసీసీ చీఫ్ పదవి రేసులో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పోటీ పడుతున్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి కూడా నేడు ఢిల్లీ పట్టారు. నేడు ఆయన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు. పైకి చెప్పకపోయినా.. తెలంగాణలో పీసీసీ చీఫ్ పదవి తనకే ఇవ్వాలని రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోనియాగాంధీని కలవడం.. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కలవనున్న తరుణంలో టీపీసీసీ చీఫ్ రేసు మరింత రసవత్తరంగా మారనుందనే టాక్ వినిపిస్తోంది.



    Revanth reddy news, komatireddy venkat reddy news, tpcc news, congress news, telangana congress, komatireddy venkat reddy news, రేవంత్ రెడ్డి న్యూస్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, టీపీసీసీ న్యూస్, కాంగ్రెస్ న్యూస్, తెలంగాణ కాంగ్రెస్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి న్యూస్
    టెన్ జన్‌పథ్‌లో సోనియాగాంధీని కలిసేందుకు వెళుతున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి


    టీపీసీసీ చీఫ్ పదవి కొత్తవారిని ఇస్తే .. పార్టీలో ఉన్న వారికి ఇబ్బందులు వస్తాయని ఇప్పటికే కాంగ్రెస్‌లోని ఓ వర్గం బలంగా వాదిస్తోంది. అలా చేస్తే తమ దారి తాము చూసుకుంటామని కొందరు నేతలు ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ ఠాగూర్‌కు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ పడుతున్న రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇద్దరూ ఢిల్లీ బాట పట్టి లాబీయింగ్ మొదలుపెట్టడంతో.. ఈ పదవి ఎవరికి దక్కుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది. మరోవైపు కొద్దిరోజుల్లోనే టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియను కాంగ్రెస్ అధినాయకత్వం పూర్తి చేస్తుందనే వార్తలు వస్తున్న నేపథ్యంతో.. హైకమాండ్ నిర్ణయం తరువాత రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
    Published by:Kishore Akkaladevi
    First published:December 16, 2020, 12:18 IST