news18-telugu
Updated: October 21, 2019, 11:17 AM IST
ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ విఫలయత్నం... పలునేతల హౌస్ అరెస్ట్
ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ హౌస్ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ మణికొండలోని స్వగృహంనందు పోలీసులు ఆయనను హౌస్ అరెస్టు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపధ్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా పోలీసులు ముందస్తుగా నేతల్ని గృహానిర్బంధం చేస్తున్నారు. మరోవైపు టీకాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీని కూడా ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు.

మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అరెస్ట్
మరోవైపు కొందరు నాయకులు ప్రగతి భవన్ ముట్టడికి విఫలయత్నం చేశారు. ప్రగతి భవన్ ముట్టడి లో భాగంగా సికింద్రాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు జిల్లాల్లోనూ కాంగ్రెస్ నేతల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఇవాళ కాంగ్రెస్ నేతలు.. ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
Published by:
Sulthana Begum Shaik
First published:
October 21, 2019, 11:17 AM IST