ఆ లోటు మీరే తీర్చాలి... తెలంగాణ గవర్నర్‌కు విజయశాంతి విజ్ఞప్తి

తెలంగాణ రాజకీయం బాగా వేడెక్కిన తరుణంలో తమిళ్ ఇసై సౌందరరాజన్ గారు గవర్నర్‌గా బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా నిష్పాక్షిక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు విజయశాంతి.

news18-telugu
Updated: September 8, 2019, 8:19 AM IST
ఆ లోటు మీరే తీర్చాలి... తెలంగాణ గవర్నర్‌కు విజయశాంతి విజ్ఞప్తి
సౌందర్ రాజన్, విజయశాంతి
news18-telugu
Updated: September 8, 2019, 8:19 AM IST
మరికొన్ని గంటల్లో తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇవాళ సాయంత్రం రాజ్‌భవన్‌లో ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత, ప్రముఖ సినీ నటి విజయశాంతి నూతన గవర్నర్ తమిళిసై రాకను స్వాగతించారు. తమిళిసైకి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాజకీయం బాగా వేడెక్కిన తరుణంలో తమిళ్ ఇసై సౌందరరాజన్ గారు గవర్నర్‌గా బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా నిష్పాక్షిక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు విజయశాంతి. తమిళనాడు రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలిగా పనిచేసిన అనుభవం ఉన్న కారణంగా ప్రతిపక్షాల పాత్రపై తమిళ్ ఇసై గారికి పూర్తి అవగాహన ఉంటుందని ఆమె నమ్ముతున్నానన్నారు.

2014లో తొలిసారి కేసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కేబినెట్లో మహిళలు ఎవరికీ అవకాశం ఇవ్వలేదన్నారు. రెండోసారీ సీఎం అయిన తర్వాత కూడా... 9 నెలలు గడుస్తున్నా, కేసిఆర్ గారి క్యాబినెట్లో మహిళలకు ఛాన్స్ దక్కలేదని ఆరపించారు రాములమ్మ. మల్లారెడ్డి గారు ప్రస్తుతం మహిళా, శిశు సంక్షేమ శాఖ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. అందువల్ల తెలంగాణలోని మహిళల సమస్యలను పట్టించుకునే దిక్కు కూడా కరువైందనే అభిప్రాయం ప్రజలలో ఉందన్నారు. ఇలాంటి తరుణంలో తెలంగాణకు మహిళా మంత్రి లేని లోటును తమిళ్ ఇసై గారు తీరుస్తారని భావిస్తున్నానని ఆశాభావం వ్యక్తంచేశారు విజయశాంతి. ఈ మేరకు ఆమె తన ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు చేశారు.First published: September 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...