కరోనా కట్టడిలో కేసీఆర్ సర్కార్ విఫలం.. అదే సాక్ష్యమన్న విజయశాంతి

గాంధీ ఆస్పత్రిలో కరోనాతో మరణించిన ఒక వ్యక్తి మృతదేహాన్ని దాదాపు రోజంతా మిగిలిన రోగుల మధ్యే ఉంచి వాళ్లను భయబ్రాంతుల్ని చేశారని విజయశాంతి విమర్శించారు.

news18-telugu
Updated: July 17, 2020, 9:27 PM IST
కరోనా కట్టడిలో కేసీఆర్ సర్కార్ విఫలం.. అదే సాక్ష్యమన్న విజయశాంతి
కేసీఆర్, విజయశాంతి
  • Share this:
కరోనా కట్టడితో కేసీఆర్ సర్కార్ విఫలమైందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్‌ విజయశాంతి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రధాన ఆస్పత్రులు గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌లోని పరిణామాలే ఇందుకు సాక్ష్యం అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రిలో కరోనాతో మరణించిన ఒక వ్యక్తి మృతదేహాన్ని దాదాపు రోజంతా మిగిలిన రోగుల మధ్యే ఉంచి వాళ్లను భయబ్రాంతుల్ని చేశారని విమర్శించారు. ఆక్సిజన్ లేక మరో కరోనా బాధితుడి ప్రాణం పోయిందని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ఉస్మానియా ఆస్పత్రి మునికినీళ్ల పాలై నరకాన్ని తలపించిందని ఆరోపించారు.

ఇక నిమ్స్‌లోనూ ఏమంత ఆశాజనక పరిస్థితులు లేవని ప్రభుత్వ విధానాలను ఆమె దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలకు దేవుడే దిక్కు అన్నట్లుగా ప్రభుత్వ యంత్రాంగం మత్తు నిద్రపోతోందని విమర్శలు గుప్పించారు.ఔట్ సోర్సింగ్ నర్సులు, వార్డ్ బాయ్స్, 4వ తరగతి సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది సమ్మె చేసే పరిస్థితి కల్పించారని ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ఈ సమ్మెను ఆపించడానికి ప్రభుత్వం రోజుల తరబడి సమయం తీసుకుందని తప్పుబట్టారు. ఇదంతా పరిశీలిస్తే కరోనాను కట్టడి చేయడంలో కేసీఆర్ దొర సర్కార్ గాడితప్పి పూర్తిగా చేతులెత్తేసినట్లు తేలిపోయిందని విజయశాంతి విమర్శించారు.
Published by: Kishore Akkaladevi
First published: July 17, 2020, 9:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading