కేసీఆర్‌ ఇప్పుడేం చేస్తారో ?.. విజయశాంతి సెటైర్

కేసీఆర్,విజయశాంతి (File Photos)

గాంధీ ఆసుపత్రి జైలు మాదిరిగా ఉందని విమర్శించిన అక్బరుద్దీన్‌కు కేసీఆర్ ఎలాంటి శాపనార్థాలు పెడతారోనని తెలంగాణ ప్రజలు భయపడుతున్నారని విజయశాంతి కామెంట్ చేశారు.

  • Share this:
    కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి మరోసారి తనదైన శైలిలో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కరోనా మహమ్మారిపై పోరులో అందరూ ప్రభుత్వానికి బాసటగా నిలవాలని సీఎం కేసీఆర్‌ ఇటీవల విలేకరుల సమావేశంలో కోరారన్న విజయశాంతి... గాంధీ ఆస్పత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేవని రాసిన మీడియా యజమానికి కరోనా వైరస్‌ సోకాలని శాపం పెట్టారని గుర్తు చేశారు. వైద్య సదుపాయాలు లేవు అన్నందుకే కరోనా రావాలన్న కేసీఆర్.. మరి గాంధీ ఆసుపత్రి జైలు మాదిరిగా ఉందని విమర్శించిన అక్బరుద్దీన్‌కు ఎలాంటి శాపనార్థాలు పెడతారోనని తెలంగాణ ప్రజలు భయపడుతున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.    బహుశా కేసీఆర్‌ పెట్టిన శాపం గురించి ఓవైసీకి తెలిసి ఉండకపోవచ్చని ఎద్దేవా చేశారు. ఒకవేళ కేసీఆర్‌, తాము ఒకటే కనుక ఈ శాపాలు తనకు వర్తించవని అక్బరుద్దీన్ ధీమాగా ఉండి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. తమకు ఈ శాపాలు తగలవని... తాము అన్నిటికీ అతీతమని అక్బరుద్దీన్ భావించి ఉండొచ్చని విమర్శించారు. రాబోయే రోజుల్లో అక్బరుద్దీన్‌కు కేసీఆర్‌ శాపం పెడతారా? లేక చూసీ చూడకుండా సర్దుకుపోతారా అనే విషయాన్ని వేచి చూడాలంటూ విజయశాంతి కామెంట్ చేశారు.
    Published by:Kishore Akkaladevi
    First published: