మరోసారి ఎన్నికల బరిలో దిగనున్న విజయశాంతి ?

VijayaShanti News: బీజేపీ కూడా ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉండటంతో.. కాంగ్రెస్ పార్టీ కూడా బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని యోచిస్తోంది.

news18-telugu
Updated: September 2, 2020, 10:11 PM IST
మరోసారి ఎన్నికల బరిలో దిగనున్న విజయశాంతి ?
విజయశాంతి(ఫైల్ ఫోటో)
  • Share this:
టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించడంతో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చింది. ఈ అంశంలో మరో ఆలోచన లేదని... నాయకులెవరైనా ఈ అంశంలో మరోలా మాట్లాడితే అది వారి వ్యక్తిగత అభిప్రాయంగానే భావించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తరపున దుబ్బాక నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. టీఆర్ఎస్ తరపున రామలింగారెడ్డి కుటుంబసభ్యుల్లో ఒకరు పోటీ చేసే అవకాశం ఉండగా.. బీజేపీ తరపున గతంలో ఇక్కడ నుంచి పోటీ చేసిన రఘునందన్ రావు బరిలో ఉండనున్నారు.

ఇప్పటికే ఆయన దుబ్బాకలో తన ఎన్నికల ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. స్థానికంగా ఉండే వివిధ అంశాలను ప్రస్తావిస్తూ ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ నుంచి అభ్యర్థులు దాదాపుగా ఖరారు కావడంతో.. కాంగ్రెస్ తరపున ఇక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై సరికొత్త చర్చ మొదలైంది. దుబ్బాక నుంచి తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి బరిలోకి దిగే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో మెదక్ ఎంపీగా వ్యవహరించిన విజయశాంతిని దుబ్బాక ఉప ఎన్నికల బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే ఆలోచన కాంగ్రెస్ వర్గాల్లో ఉన్నట్టు తెలుస్తోంది.

బీజేపీ కూడా ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉండటంతో.. కాంగ్రెస్ పార్టీ కూడా బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే విజయశాంతి పేరు తెరపైకి వచ్చిందని తెలుస్తోంది. అయితే విజయావకాశాలు తక్కువగా ఉండే ఈ ఎన్నికల బరిలో విజయశాంతి నిలుస్తారా అన్నది సందేహమే అని పలువురు చర్చించుకుంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ తరపున విజయశాంతి బరిలోకి దిగితే.. దుబ్బాక ఉప ఎన్నిక పోరు మరింత రసవత్తరంగా మారే అవకాశం లేకపోలేదు.
Published by: Kishore Akkaladevi
First published: September 2, 2020, 10:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading