• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • CONGRESS LEADER VIJAYASHANTI INTERESTING COMMENTS IN TELANGANA ELECTION CAMPAIGN

ఎవరు డబ్బులిచ్చినా... ఓటు కాంగ్రెస్‌కే వేయండి: విజయశాంతి

ఎవరు డబ్బులిచ్చినా... ఓటు కాంగ్రెస్‌కే వేయండి: విజయశాంతి

విజయశాంతి(ఫైల్ ఫోటో)

ఎన్నికల్లో ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోవాలన్న విజయశాంతి... ఓటు మాత్రం కాంగ్రెస్‌కే వేయాలని ప్రజలను కోరారు. బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీమంత్రి సుదర్శన్ రెడ్డికి మద్దతుగా విజయశాంతి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

  • Share this:
    టీఆర్ఎస్ ప్రభుత్వంపై టీ పీసీసీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ను గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకుందామని ఆమె అన్నారు. ఎన్నికల్లో ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోవాలన్న విజయశాంతి... ఓటు మాత్రం కాంగ్రెస్‌కే వేయాలని ప్రజలను కోరారు. బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీమంత్రి సుదర్శన్ రెడ్డికి మద్దతుగా విజయశాంతి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ పాలనలో బోధన్‌లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విజయశాంతి వ్యాఖ్యానించారు.

    తెలంగాణలో కేసీఆర్‌ను గద్దె దించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ప్రతిపక్షాల మధ్య ఓట్లు చీలకూడదనే ఉద్దేశ్యంతోనే టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని వ్యాఖ్యానించారు. తెలంగాణలో మహాకూటమి అభ్యర్థుల విజయం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దొరల పాలనను తరిమికొట్టాలని ఆమె ప్రజలకు పిలుపునచ్చారు. కేసీఆర్ ప్రజల సొమ్మును దోచుకున్నారని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ వల్లే సాధ్యమైందని... కేసీఆర్ వల్ల కాదని విజయశాంతి అన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు