టీఆర్ఎస్ అలాంటి స్థితిలో ఉందన్న విజయశాంతి

గతంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకు టీఆర్ఎస్ ప్రయత్నించిందని ఆరోపించిన విజయశాంతి... ఇప్పుడు కాలం మారిపోగా, టీఆర్ఎస్ ఎంపీలు బీజేపీవైపు చూస్తున్నారని వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: July 16, 2019, 1:55 PM IST
టీఆర్ఎస్ అలాంటి స్థితిలో ఉందన్న విజయశాంతి
విజయశాంతి ఫైల్ ఫోటో..
  • Share this:
తెలంగాణలోని అధికార టీఆర్ఎస్‌పై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు. గతంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకు టీఆర్ఎస్ ప్రయత్నించిందని ఆరోపించిన విజయశాంతి... ఇప్పుడు కాలం మారిపోగా, టీఆర్ఎస్ ఎంపీలు బీజేపీవైపు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో విజయశాంతి ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. బీజేపీలో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డీఎస్ చేరే అవకాశం ఉందని పరోక్షంగా సంకేతాలు ఇచ్చిన ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి దత్తాత్రేయ వ్యాఖ్యలను విజయశాంతి గుర్తు చేశారు.సీఎం కెసిఆర్ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో బలహీన పరిచే ప్రయత్నంలో, ఎమ్మెల్యేలను గుంజుకుని విలీనం కార్యక్రమం చేపట్టారని విమర్శించారు. ఇప్పుడు అదే విలీన ప్రక్రియ పార్లమెంట్‌లో టిఆర్ఎస్ ఎంపిలు మరో పార్టీ వైపు కొనసాగిస్తే, అడిగే నైతిక హక్కు లేని స్థితి టిఆర్ఎస్ స్వయంగా సృష్టించుకుందని ఆమె విమర్శించారు. కాలం ఎప్పుడు కూడా మారుతూనే ఉంటుందని పరోక్షంగా టీఆర్ఎస్‌ తీరును తప్పుబట్టారు.

First published: July 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...