‘ఆ బాధ ఎలా ఉంటుందో కేసీఆర్‌కు తెలుస్తోంది’

కేంద్రం ప్రతిపాదించిన సంస్కరణలు తప్పయితే కేంద్రం కంటే ముందు వాటిని తెలంగాణలో ఎందుకు అమలు చేశారో కేసీఆర్ వివరణ ఇవ్వాలని విజయశాంతి డిమాండ్ చేశారు.

news18-telugu
Updated: May 19, 2020, 8:27 PM IST
‘ఆ బాధ ఎలా ఉంటుందో కేసీఆర్‌కు తెలుస్తోంది’
కేసీఆర్,విజయశాంతి (File Photos)
  • Share this:
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఫేస్ బుక్ వేదికగా కేసీఆర్ తీరుపై మండిపడుతున్న విజయశాంతి... మరోసారి ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. కరోనా ప్రభావం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్‌పై సీఎం కేసీఆర్ స్పందించిన తీరు అయోమయంగా ఉందని తెలంగాణ ప్రజలు అభిప్రాయపడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. కేంద్రం ఫెడరల్ వ్యవస్థను తూట్లు పొడుస్తోందని ఆరోపించే ముందు.. తెలంగాణలో సీఎం దొర అభివృద్ధిని సాకుగా చూపించి ప్రతిపక్ష ఎమ్మెల్యేల మెడపై కత్తి పెట్టి... వారిని లొంగదీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలంగాణ సమాజం గుర్తు చేసుకుంటోందని విజయశాంతి అన్నారు. ప్రత్యర్థుల మెడపై కత్తి పెట్టి.. వారిని లొంగదీసుకునే విషయంలో బాధ ఎలా ఉంటుందో సీఎం దొరకి ఇప్పుడే తెలుస్తున్నట్లు ఉందని వ్యాఖ్యానించారు. కేంద్రం ప్రతిపాదించిన సంస్కరణలు తప్పయితే కేంద్రం కంటే ముందు వాటిని తెలంగాణలో ఎందుకు అమలు చేశారో కేసీఆర్ వివరణ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.
First published: May 19, 2020, 8:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading