Home /News /politics /

CONGRESS LEADER VIJAYASHANTI COMMENTS ON PARTY DEFECTIONS SB

పార్టీ మార్పుపై సంచలన వ్యాఖ్యలు చేసిన విజయశాంతి

విజయశాంతి (File)

విజయశాంతి (File)

కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారన్న వార్తలను ఖండించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ, తాను పార్టీ మారుతున్నానన్న ప్రచారం కూడా గాంధీ భవన్ లోనే ప్రారంభమైందని ఆరోపించారు.

  గతకొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి పార్టీ మారుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు ఈ వ్యాఖ్యలపై స్పందించారు రాములమ్మ. గాంధీభవన్‌‌లో కొందరు తనపై కుట్ర చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారన్న వార్తలను ఖండించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ, తాను పార్టీ మారుతున్నానన్న ప్రచారం కూడా గాంధీ భవన్ లోనే ప్రారంభమైందని ఆరోపించారు. పార్టీ విడిచి వెళ్లాలనుకుంటే బహిరంగంగానే ప్రకటిస్తానన్నారు. హడావుడి నిర్ణయాలు తీసుకోనని స్పష్టం చేశారు విజయశాంతి ఇదే విషయాన్ని టీ-పీసీసీ చీఫ్ ఉత్తమ్ కు కూడా స్పష్టం చేశానని పేర్కొన్నారామె.

  విజయశాంతి  కాంగ్రెస్ గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయిపోతున్నారన్న పుకార్లు గత కొన్ని రోజులుగా షికార్లు చేస్తున్నాయి. గతంలో విజయశాంతి బీజేపీలో కూడా పనిచేశారు. దీంతో అప్పట్నుంచి ఇప్పటివరకు బీజేపీలోని కేంద్ర నేతలతో ఆమెకు మంచి పరిచయాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ ఆమె వాటిని అలానే కొనసాగిస్తున్నారని అనుచరులు అంటున్నారు. ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్‌లో న్న విజయశాంతి అది పూర్తవ్వగానే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను సైతం ఆమె కలవనున్నారని జోరుగా వార్తలు వినిపించాయి. వీటిపై స్సదించిన విజయశాంతి అలాంటిదేమి లేదని తేల్చేశారు.
  Published by:Sulthana Begum Shaik
  First published:

  Tags: Telangana News, TS Congress, Vijayashanti

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు