అన్నకు ఓపిక తగ్గిపోయింది... ఈసారి ప్రజలే వ్యూహకర్తలు: విజయశాంతి

అన్నకు ఓపిక తగ్గిపోయింది... ఈసారి ప్రజలే వ్యూహకర్తలు: విజయశాంతి

కేసీఆర్, విజయశాంతి(ఫైల్ ఫోటో)

టీఆర్ఎస్ పార్టీని గద్దె దించేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి అన్నారు. నాలుగున్నరేళ్లలో కేసీఆర్ పాలనను చూసి తెలంగాణ జనం విసుగెత్తిపోయారని విమర్శించారు.

 • Share this:

  కేసీఆర్ గేమ్ చేంజర్. పదునైన వ్యూహాలతో ఆఖరు నిమిషంలో వార్ వన్‌సైడ్ చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ప్రచారపర్వంలో చివరి మూణ్నాలుగు రోజులే కీలకంగా ఆయన వ్యూహాలు రచిస్తుంటారు. 2014 ఎన్నికల్లో అలాంటి స్ట్రాటజీనే టీఆర్ఎస్‌ను అధికారంలోకి తీసుకొచ్చింది. అయితే ఈసారి అలాంటి అవకాశం లేదని చెబుతున్నారు కాంగ్రెస్ నేత విజయశాంతి. కేసీఆర్ వ్యూహాలు ఈసారి పనిచేయవని స్పష్టం చేశారు. భారీ మెజార్టీతో ప్రజాకూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

  కూటమిలో సీట్ల పంపకాలు ముగియడంతో ప్రచారపర్వంలోకి దూకారు కాంగ్రెస్ నేతలు. అందులో భాగంగానే కరీంనగర్‌లో జరిగిన కాంగ్రెస్ మహిళా సదస్సులో విజయశాంతి పాల్గొన్నారు.
  రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.


  గతంలో అన్న కేసీఆర్‌కు చాలా ఓపిక ఉండేదని, ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయిందని విజయశాంతి ఎద్దేవా చేశారు. అప్పుడు ఆయన వ్యూహాలు పనిచేసి ఉండొచ్చనీ.. ఈసారి ప్రజలే వ్యూహకర్తలుగా ఉన్నారని.. కేసీఆర్‌కు తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ పార్టీ మళ్లీరావాలనే నినాదం ప్రజల్లో వినబడుతోందని విజయశాంతి అన్నారు.
  Published by:Santhosh Kumar Pyata
  First published:

  అగ్ర కథనాలు