• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • CONGRESS LEADER VIJAYASHANTI APPRECIATES GOVERNOR NARASIMHAN AND WARNS CM KCR AK

గవర్నర్ మారారు... కేసీఆర్ మారాలన్న విజయశాంతి

గవర్నర్ మారారు... కేసీఆర్ మారాలన్న విజయశాంతి

విజయశాంతి ఫైల్ ఫోటో(Image:Facebook)

నియంతృత్వ ధోరణితో టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలను మొదట్లో ప్రతిపక్షాలు తప్పుబట్టాయని... కానీ అధికారం కళ్లు కప్పేయడంతో సీఎం కేసీఆర్ ప్రతిపక్షాల మాటలను బేఖాతరు చేశారని విజయశాంతి మండిపడ్డారు.

  • Share this:
    టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత విజయశాంతి మరోసారి విమర్శలు గుప్పించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులు శిశుపాలుడి తప్పుల్ని మించిపోతున్నాయని ఆమె ఆరోపించారు. నియంతృత్వ ధోరణితో టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలపై మొదట్లో ప్రతిపక్షాలు తప్పుబట్టాయని... కానీ అధికారం కళ్లు కప్పేయడంతో సీఎం కేసీఆర్ ప్రతిపక్షాల మాటలను బేఖాతరు చేశారని మండిపడ్డారు. దీనికి తోడు ప్రభుత్వ నిర్ణయాలను తప్పు పడితే కేసులు పెట్టి జైలుకు పంపుతామని కేసీఆర్ హెచ్చరించారని విజయశాంతి అన్నారు. మరోవైపు టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకునే విధాన పరమైన నిర్ణయాలను హైకోర్టు కూడా పలు సందర్భాల్లో తప్పు పట్టిందని గుర్తు చేశారు.

    కొన్ని ప్రభుత్వ జీవోలను రద్దు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని విజయశాంతి అన్నారు. ఇంత జరిగినా నిమ్మకు నీరెత్తినట్టు టీఆర్ఎస్ సర్కార్ తాను అనుకున్నది జరగాలని మొండి వైఖరిని అనుసరిస్తోందని ఆమె ఆరోపించారు. అందుకే చివరకు సీఎం కెసిఆర్ గారిని ఇంతకాలం వెనకేసుకువచ్చిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా చివరకు తన వైఖరి మార్చుకున్నారని అన్నారు. మున్సిపల్ చట్టాన్ని రద్దు చేయాలని సూచిస్తూ దాన్ని తిప్పి పంపి టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఊహించని షాక్ ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా కేసీఆర్ తన తప్పుల్ని గుర్తించి వాటిని సరిదిద్దుకోకపోతే రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
    First published: