Home /News /politics /

CONGRESS LEADER VIJAYASHANTHI LIKELY TO JOIN BJP NS

Vijayashanthi: బీజేపీలో విజయశాంతి చేరేది ఆ రోజే? త్వరలో ఆ కీలక నేతలు కూడా..

Vijayashanthi on kcr : తన ప్రయోజనాల కోసమే లాక్డ్‌న్ ఎత్తివేసిన సీఎం

Vijayashanthi on kcr : తన ప్రయోజనాల కోసమే లాక్డ్‌న్ ఎత్తివేసిన సీఎం

కాంగ్రెస్ పార్టీ నేతలకు దుబ్బాక ఎన్నికల ఫలితం షాక్ ఇచ్చింది. ఆ పార్టీ అభ్యర్థి మూడో స్థానంలో నిలవడంతో నాయకుల నుంచి కార్యకర్తల వరకు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ నేత విజయశాంతి కమలం గూటికి చేరడం ఖాయమని తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
    ఇటీవల హోరాహోరీగా జరిగిన దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర మార్పులు తీసుకువచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇన్నాళ్లు టీఆర్ఎస్ పార్టీని ఓడించేది మేమే అంటూ చెప్పిన కాంగ్రెస్ పార్టీ నేతలకు ఈ ఫలితం షాక్ ఇచ్చింది. ఆ పార్టీ అభ్యర్థి మూడో స్థానంలో నిలవడంతో నాయకుల నుంచి కార్యకర్తల వరకు తీవ్ర నిరాశకు గురయ్యారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతోందన్న వాతావరణం ఏర్పడుతుండడంతో ఆ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వలసలు అధికమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా అనేక మంది కాంగ్రెస్ నేతలు కమలం వైపు చూస్తున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దుబ్బాక ఎన్నికల ప్రచారం ఓ వైపు జోరుగా సాగుతుండగానే టీపీసీసీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి బీజేపీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే ఆ సమయంలో ఆమె పార్టీ మారలేదు.

    అయితే దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం తదితర పరిణామాల నేపథ్యంలో రాములమ్మ పార్టీ మారడం ఖాయమైపోయిందని తెలుస్తోంది. ఈ నెల 14న ఆమె డిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలోనే ఆమె కాషాయ కండువా కప్పుకుంటారన్న వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ ముఖ్య సమావేశాలకు తనకు ఆహ్వానం అందడం లేదని ఆమె అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు పలువురు కీలక నేతలు కూడా బీజేపీ గూటికి చేరనున్నారని సమాచారం. వరుస ఓటముల నేపథ్యంలో పీసీసీ చీఫ్ ను మార్చాలని అనేక మంది కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.  అయితే హైకమాండ్ మాత్రం ఆ విషయాన్ని వాయిదా వేస్తూ వస్తోంది.

    దీంతో ఆ పదవిపై ఆశలు పెట్టుకున్న అనేక మంది సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారిలో కొందరు బీజేపీ గూటికి చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ కు చెందిన ఓ ఎంపీ బీజేపీ అధిష్టానంతో మంతనాలు సాగిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన రాజకీయ భవిష్యత్ కోసం ఆ కాంగ్రెస్ కీలక నేత ఏదో ఒక రోజు కాషాయ కండువా కప్పుకుంటారని బీజేపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. నల్లగొండ జిల్లాకు చెందిన మరో కీలక నేత కూడా కాషాయ కండువా కప్పుకుంటారని వార్తలు వస్తున్నాయి. పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న తనను నాయకత్వం సరిగా పట్టించుకోవడం లేదని ఆ నాయకుడు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Dubbaka By Elections 2020, Tpcc, Uttam Kumar Reddy, Vijayashanti

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు