గజ్వేల్ గల్లీ లీడర్‌గా మారిన హరీశ్‌రావు: కూటమి అభ్యర్థి ప్రతాప్‌రెడ్డి

టీఆర్ఎస్ నేత హరీశ్ రావుపై కాంగ్రెస్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వెల్‌లో కూటమి గెలుపు ఖాయమనే భయంతోనే.. అక్రమ కేసులతో తనను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Santhosh Kumar Pyata | news18-telugu
Updated: November 26, 2018, 12:42 PM IST
గజ్వేల్ గల్లీ లీడర్‌గా మారిన హరీశ్‌రావు: కూటమి అభ్యర్థి ప్రతాప్‌రెడ్డి
vnateru pratap harish rao file
  • Share this:
కేసీఆర్ ఫామ్ హౌజ్ నిండా డబ్బుల కట్టలే ఉన్నా.. పోలీసులు అటువైపుగా వెళ్లడం లేదని గజ్వెల్‌లో ప్రజాకూటమి అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. తనను, తన కుటుంబాన్ని మాత్రం సోదాల పేరుతో ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితి లేదని.. అన్ని వ్యవస్థలూ నిర్వీర్యమయ్యాయని విమర్శించారు. ప్రాణాలకు తెగించే ఆమరణ నిరాహాదదీక్షకు కూర్చున్నానని, పోలీసులు నిర్ధాక్షిణ్యంగా అరెస్టు చేశారని చెప్పారు.

ఇటీవల సోదాల్లో లభించిన డబ్బులు ప్రైవేటు వ్యక్తులవని పోలీసులు చెబుతున్నా.. హరీశ్ రావు మాత్రం ప్రతాప్‌రెడ్డివే అంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఓడిపోతారనే భయంతో గజ్వెల్ గల్లీలో హరీశ్ తిష్టవేసి ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో కేసీఆర్ పేర్కొన్న ఆస్తుల వివరాలు తప్పుల తడకగా ఉన్నాయని ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. ప్రజాకూటమి అధికారంలోకి రాగానే కేసీఆర్, హరీశ్‌రావుల అక్రమాలను వెలికి తీస్తామని హెచ్చరించారు.

కేసీఆర్ కుటుంబానికి అన్ని ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలని ప్రతాప్ రెడ్డి ప్రశ్నించారు. చీము, నెత్తురు లేనట్టుగా హరీశ్‌రావు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ను కలిసిన ప్రతాప్ రెడ్డి.. కేసీఆర్ నియంతృత్వ పాలనకు తెరపడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.
Published by: Janardhan V
First published: November 26, 2018, 12:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading