Telangana: కాంగ్రెస్‌లో పీసీసీ మంటలు.. వీహెచ్ సంచలన వ్యాఖ్యలు.. సాగనంపే ప్రయత్నం..

వి. హనుమంతరావు

పీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంపికపై ఏఐసీసీ తుది కసరత్తు చేస్తోందన్న సమాచారంతో ఆశావహులు ఢిల్లీ బాటపట్టారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, పీసీసీ వర్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఢిల్లీలోనే ఉన్నారు. పార్టీ చీఫ్ పదవి తమకే ఇవ్వాలని ఈ ముగ్గురు నేతలు కాంగ్రెస్ పెద్దలతో లాబీయింగ్ చేస్తున్నారు.

  • Share this:
    తెలంగాణ పీసీసీ కొత్త చీఫ్ ఎవరు? కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో దీని గురించే రచ్చ జరుగుతోంది. ఇప్పుడా రచ్చ తారా స్థాయికి చేరింది. పీసీసీ చీఫ్ పదవిపై ఎంతో మంది సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు. లిస్టులో చాలా మందే ఉన్నారు. ఆ పదవి కోసం చాలా రోజులుగా ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారు. ఐతే పీసీసీ చీఫ్‌ను కాంగ్రెస్ పెద్దలు దాదాపు ఖరారు చేశారని.. ఒకటి రెండు రోజుల్లోనే అధికారిక ప్రకటన వస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆ పార్టీ సీనియర్ వి. హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్‌పై విరుచుకుపడ్డారు. పీసీసీ చీఫ్ ఎవరన్న దానిపై మాణిక్కం ఠాగూర్ ఒక్కరే అభిప్రాయన సేకరణ చేస్తారా? అని మండిపడ్డారు వీహెచ్. పీపీసీ కోసం పరిశీలకుడిని ఎందుకు పంపించడం లేదని హైమాండ్‌కు కూడా ప్రశ్నించారు. బీజేపీ ప్రధాన కార్యదర్శులు రాష్ట్రానికి వస్తే పార్టీ బలోపేతం కోసం కష్టపడుతున్నారని.. కానీ కాంగ్రెస్‌లో ఆ పరిస్థితి కనిపించడం లేదని విమర్శించారు వి.హనుమంతరావు. కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జ్‌కి ఫోన్ చేస్తే కనీసం లిఫ్ట్ చేయడం లేదని ధ్వజమెత్తారు.

    బయట నుంచి వచ్చిన వారికి పీపీసీ చీఫ్ పదవి ఇచ్చే ప్రయత్నం జరుగుతోందని.. అలా జరిగితే తమ ఆత్మగౌరవం దెబ్బ తినదా అని ఆవేదన వ్యక్తం చేశారు వీహెచ్. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తే.. మొదటి నుంచి ఉన్న వారి పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న లాయలిస్టులకే పీసీసీ చీఫ్ పదవిని ఇవ్వాలని వి. హనుమంతరావు డిమాండ్ చేశారు. పీసీసీ గురించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లెటర్ రాశానని చెప్పారు. పార్టీ నుంచి తనను సాగనంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు వీహెచ్. రాజకీయాల్లోకి తాను పదవుల కోసం రాలేదని.. సామాజిక న్యాయం కోసమే పనిచేస్తున్నానని స్పష్టం చేశారు.


    మరోవైపు పీసీసీ అధ్యక్షుడి ప్రకటన త్వరలోనే వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. పీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంపికపై ఏఐసీసీ తుది కసరత్తు చేస్తోందన్న సమాచారంతో ఆశావహులు ఢిల్లీ బాటపట్టారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, పీసీసీ వర్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఢిల్లీలోనే ఉన్నారు. పార్టీ చీఫ్ పదవి తమకే ఇవ్వాలని ఈ ముగ్గురు నేతలు కాంగ్రెస్ పెద్దలతో లాబీయింగ్ చేస్తున్నారు. పార్టీ తెలంగాణ ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ కూడా వీరితో వేర్వేరుగామంతనాలుల జరిపారు.
    ఐతే ఏఐసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోనియాగాంధీ, రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గాంధీ, ఇతర ముఖ్య నేతలతో తుది విడత సంప్రదింపులు జరిపి తెలంగాణ పార్టీ అధ్యక్షుడిని ఖరారు చేస్తారని సమాచారం. ఐతే ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆయనకే పీసీసీ పగ్గాలు అప్పగిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రేవంత్‌కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే.. ఇతర నేతలకు ఏఐసీసీలో కీలక పదవులు ఇస్తారని తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
    Published by:Shiva Kumar Addula
    First published: