YS Sharmila Political Party: షర్మిల కొత్త పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు

వైఎస్ షర్మిల(ఫైల్ ఫొటో)

YS Sharmila Political Party: జగన్‌పై కోపం ఉంటే ఆమె ఏపీలో పార్టీ పెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సూచించారు. వైఎస్ జగన్‌కు, షర్మిలకు మధ్య విభేదాలు ఉన్నమాట వాస్తవమే అని వ్యాఖ్యానించారు.

  • Share this:
    వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నారనే న్యూస్ రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ అంశంపై పలువురు నేతలు స్పందించారు. వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై తెలంగాణ నేతలు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. షర్మిల తెలంగాణలో ఎందుకు పార్టీ పెడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ప్రశ్నించారు. జగన్‌పై కోపం ఉంటే ఆమె ఏపీలో పార్టీ పెట్టాలని సూచించారు. జగన్ పార్టీ కోసం షర్మిల చాలా కష్టపడ్డారని వీహెచ్ అన్నారు. షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు బీజేపీ కుట్రలో భాగమని వీహెచ్ ఆరోపించారు. షర్మిల పార్టీ ద్వారా తెలంగాణలో ఓట్లు చీల్చి లబ్ది పొందాలని చూస్తోందని వీహెచ్ అన్నారు. వైఎస్ జగన్‌కు, షర్మిలకు మధ్య విభేదాలు ఉన్నమాట వాస్తవమే అని వ్యాఖ్యానించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి లబ్ధిపొందిన కొందరు షర్మిలకు సహకరించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఒక సామాజిక వర్గం షర్మిలకు సపోర్ట్ చేసే అవకాశం ఉందని అన్నారు.

    ఇక తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టడంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తనదైన శైలిలో స్పందించారు. ఆమె పార్టీ పెట్టబోయేది జగన్ డైరెక్షన్‌లోనేనా లేదా అన్నది త్వరలోనే తెలుస్తుందని వ్యాఖ్యానించారు. జగన్, షర్మిల మధ్య అద్భుతమైన అనుబంధం ఉందని అన్నారు. ఒకవేళ నిజంగానే వారిద్దరి మధ్య వైరం ఉంటే పార్టీ ఆంధ్రాలో పెట్టాలని సూచించారు. వారి అనుబంధం ఎలాంటిదో ఇక్కడే అర్థమవుతోందని రఘురామకృష్ణంరాజు అన్నారు. షర్మిల ఎవరు వదిలిన బాణమో త్వరలో తెలుస్తుందని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నినాదం సమైక్యాంధ్ర అయినప్పుడు షర్మిల పార్టీకి తెలంగాణలో ఓట్లు రావడం కష్టమేనని అన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకమని, సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలమని రఘురామకృష్ణంరాజు అన్నారు. జగన్ జైళ్లో ఉన్నప్పుడు పార్టీ కోసం షర్మిల చాలా కష్టపడ్డారని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. షర్మిల తెలంగాణ కన్నా తమిళనాడు లేదా కర్నాటకలో పార్టీ పెడితే ఎక్కువ ఓట్లు వస్తాయని చెప్పారు.
    Published by:Kishore Akkaladevi
    First published: