పంజాగుట్టలో ఉద్రిక్తత.. అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు వీహెచ్ యత్నం..

ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ముందు రోజు రాత్రి పంజాగుట్టలో దళిత బహుజన సంఘాలు ఆయన విగ్రహం ఏర్పాటు చేశాయి. అయితే ఆ స్ధలంలో విగ్రహం ఏర్పాటుకు అనుమతిలేదంటూ అధికారులు పోలీసుల సహాయంతో దానిని తొలగించారు.

news18-telugu
Updated: June 18, 2019, 11:14 AM IST
పంజాగుట్టలో ఉద్రిక్తత.. అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు వీహెచ్ యత్నం..
పంజాగుట్ట సర్కిల్‌లో ఆందోళన చేస్తున్న వీహెచ్
  • Share this:
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మంగళవారం తెల్లవారుజామున పంజాగుట్ట సర్కిల్‌లోని వైఎస్ విగ్రహం ఎదుట ఆందోళనకు దిగారు. తొలగించిన అంబేడ్కర్ విగ్రహాన్ని పున:ప్రతిష్టించేందుకు ఆయన విగ్రహాన్ని తీసుకుని వచ్చారు. అయితే పోలీసులు అందుకు అభ్యంతరం తెలపడంతో వీహెచ్ అనుచరులకు వారికి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు తెలత్తాయి. వీహెచ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అంబేడ్కర్ విగ్రహ పున:ప్రతిష్టకు అనుమతి లేదని, అనుమతి వచ్చాక ప్రతిష్టించుకుంటే తమకేమీ అభ్యంతరం లేదని ఏసీపీ తిరుపతి స్పష్టం చేశారు. మరోవైపు వీహెచ్ మాత్రం పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. వైఎస్ విగ్రహానికి లేని అభ్యంతరం మహానీయుడు అంబేడ్కర్ విగ్రహానికి ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అంబేడ్కర్ విగ్రహాన్ని తిరిగి అక్కడ పున:ప్రతిష్టించేదాకా తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు.

కాగా, ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ముందు రోజు రాత్రి పంజాగుట్టలో దళిత బహుజన సంఘాలు ఆయన విగ్రహం ఏర్పాటు చేశాయి. అయితే ఆ స్ధలంలో విగ్రహం ఏర్పాటుకు అనుమతిలేదంటూ అధికారులు పోలీసుల సహాయంతో దానిని తొలగించారు. చెత్తలారీలో విగ్రహాన్ని జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డ్‌కు తరలించారు. విగ్రహాన్ని తొలగించడమే కాకుండా దాన్ని డంపింగ్ యార్డులో పడేయడంతో వివాదం మొదలైంది. బహుజన సంఘాలు దీనిపై భగ్గుమన్నాయి. ప్రస్తుతం ఈ ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతోంది. అటు దళిత బహుజన సంఘాలు మాత్రం తొలగించిన చోటే మళ్లీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
V hanumantha Rao protest in Panjagutta

(వీహెచ్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తున్న దృశ్యం)First published: June 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>