• HOME
 • »
 • NEWS
 • »
 • POLITICS
 • »
 • CONGRESS LEADER V HANUMANTHA RAO CRITICIZES CM KCR AND BJP AK

పని తక్కువ... యాక్షన్ ఎక్కువ... కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత సెటైర్

పని తక్కువ... యాక్షన్ ఎక్కువ... కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత సెటైర్

సీఎం కేసీఆర్(ఫైల్ పోటో)

ఎన్ని ఆంక్షలు పెట్టినా కడుపు మండిన ఆర్టీసీ కార్మికులు చలో ట్యాంక్ బండ్‌ను సక్సస్ చేశారని వీహెచ్ అన్నారు.

 • Share this:

  కేసీఆర్ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక పని తక్కువ యాక్షన్ ఎక్కువైందని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా కడుపు మండిన ఆర్టీసీ కార్మికులు చలో ట్యాంక్ బండ్‌ను సక్సస్ చేశారని వీహెచ్ అన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ పేరుతో కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులకు అన్ని వర్గాలు మద్దతు ఇస్తున్నాయని వీహెచ్ తెలిపారు. గోల్నాక ఫంక్షన్ హాల్ దుర్ఘటనలో మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు అధికారులు,మంత్రులు వెళ్లకపోవడం బాధాకారమని అన్నారు. గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత తొలగింపు సరికాదని ఆయన అన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వ్యాఖ్యానించారు.

  గాంధీ కుటుంబం లేకుండా చేయాలని ఆర్ఎస్ఎస్ కుట్రలు చేస్తోందని వీహెచ్ మండిపడ్డారు. వారికి ఏం జరిగినా మోదీ, అమిత్ షా దే బాధ్యత అని ఆరోపించారు. వారి భద్రత పునరుద్ధరించకపోతే దేశం భగ్గుమంటుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ చనిపోయిందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ అనడం విచారకరమని వీహెచ్ వ్యాఖ్యానించారు. బీజేపీని గెలిపించడానికే అసద్ మహారాష్ట్రకు వెళ్లి ప్రచారం చేశారని ఆరోపించారు. మహారాష్ట్రలో బీజేపీ ఖతం అయిందని వీహెచ్ అన్నారు.
  First published: