కొత్త గవర్నర్‌తో మాకు న్యాయం...కాంగ్రెస్ నేత ఫుల్ ఖుషి

నిన్న అలయ్ బలయ్ కార్యక్రమంలో తనకు గవర్నర్ అపాయింట్ మెంట్ దక్కడం లేదని స్వయంగా తమిళిసై ముందే వీహెచ్ ప్రకటించారు. ఆ మరుసటి రోజే ఆయనకు గవర్నర్ కార్యాలయం నుంచి పిలుపు రావడం విశేషం.

news18-telugu
Updated: October 11, 2019, 2:40 PM IST
కొత్త గవర్నర్‌తో మాకు న్యాయం...కాంగ్రెస్ నేత ఫుల్ ఖుషి
ప్రమాణస్వీకారం సందర్భంగా గవర్నర్ తమిళసై సౌందర రాజన్, సీఎం కేసీఆర్ (File Photo)
  • Share this:
కొత్త గవర్నర్ వచ్చాక తమకు న్యాయం జరుగుతుందన్న ఆశ కలుగుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్ భవన్‌లో గవర్నర్‌ తమిళిసైను కలిసిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ సమ్మె అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు వీహెచ్ వివరించారు. సమ్మె కారణంగా నలుగురు ఉద్యోగులు చనిపోయారని అన్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. హాజీపూర్ సంఘటనకు సంబంధించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు అంశంపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వీహెచ్ అన్నారు. సీఎం కేసీఆర్ కనీసం బాధితులను కూడా పరామర్శించలేదని విమర్శించారు.

దీపావళి తరువాత తన ఇంట్లో జరిగే సత్యనారాయణ వ్రతానికి రావాలని గవర్నర్ తమిళిసైను ఆహ్వానించినట్టు ఆయన తెలిపారు. తాను చెప్పిన అంశాల పట్ల గవర్నర్ సానుకూలంగా స్పందించారని వీహెచ్ వివరించారు. నిన్న అలయ్ బలయ్ కార్యక్రమంలో తనకు గవర్నర్ అపాయింట్ మెంట్ దక్కడం లేదని స్వయంగా తమిళిసై ముందే వీహెచ్ ప్రకటించారు. ఆ మరుసటి రోజే ఆయనకు గవర్నర్ కార్యాలయం నుంచి పిలుపు రావడం విశేషం.

First published: October 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading