కేసీఆర్ వల్లే ఏపీలో 3 రాజధానులు.. కాంగ్రెస్ నేత విమర్శలు

ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. 3 రాజధానుల విధానాన్ని తాను ఎప్పుడూ వినలేదని.. దేశంలో ఎక్కడా ఇది లేదన్నారు వి. హనుమంతరావు.


Updated: January 21, 2020, 5:10 PM IST
కేసీఆర్ వల్లే ఏపీలో 3 రాజధానులు.. కాంగ్రెస్ నేత విమర్శలు
వైఎస్ జగన్, కేసీఆర్
  • Share this:
మూడు రాజధానుల అంశం ఏపీలో దుమారం రేపుతోంది. ఏపీ ప్రభుత్వం తీరుపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అటు అమరావతిలోనూ రైతులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ రాజకీయాలపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. 3 రాజధానుల విధానాన్ని తాను ఎప్పుడూ వినలేదని.. దేశంలో ఎక్కడా ఇది లేదన్నారు వి. హనుమంతరావు. హైదరాబాద్‌లో గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన వీహెచ్.. తెలంగాణ సీఎం కేసీఆర్ సూచన మేరకే ఏపీ సీఎం వైఎస్ జగన్ 3 రాజధానుల కాన్సెప్ట్‌ని తెరపైకి తెచ్చారని చెప్పారు. అమరావతిని కట్టేందుకే నిధులు లేవంటే... ఇప్పుడు మూడు రాజధానుల కోసం నిధులు ఎక్కడి నుంచి వస్తాయని అన్నారు వీహెచ్.
Published by: Shiva Kumar Addula
First published: January 21, 2020, 5:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading