ముఖ్యమంత్రికి ప్రజల బాధలకంటే తన మొండి పట్టుదలనే ప్రాధాన్యతగా ఉందని కాంగ్రెస్ మండిపడింది. రాష్ట్రంలో కరోనా వైరస్‌తో జనం అల్లాడుతుంటే ఇంత ఆఘమేఘాల మీద పాత సచివాలయం కూల్చివేత ఎందుకని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, మాజీ మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ఉద్యోగులకు జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదన్న కాంగ్రెస్ నేతలు.. ఇలాంటి సమయంలో కొత్త సచివాలయం అవసరమా అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఇంతటి దుర్భర పరిస్తితులుంటే సీఎం కేసార్ కనీసం వైద్యంపైన సమీక్ష కూడా చేయకుండా ఎక్కడో చీకటిలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు.
తాము పాత సచివాలయంలో కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటు చేయమని కోరామని..అలా చేస్తే 10 వేల మంది రోగులకు సౌకర్యంగా ఉండేదని కాంగ్రెస్ నేతలు అన్నారు. కానీ సీఎం తన మొండి వైఖరితో జనం ప్రాణాలు తీస్తున్నారని విమర్శించారు. మొదటినుంచి సీఎం కరోనా విషయంలో తప్పుడు విధానాలతోనే పోతున్నారని ఆరోపించారు. అందుకే నేడు రాష్ట్రం ఇంతటి దుర్భర పరిస్థితి ఎదుర్కొంటుందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.
Published by:Kishore Akkaladevi
First published:July 07, 2020, 11:32 IST