HOME »NEWS »POLITICS »congress leader urmila matondkar to contest lok sabha elections from mumbai north ms

ముంబై నార్త్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా ఊర్మిళ..

ముంబై నార్త్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా ఊర్మిళ..
కాంగ్రెస్ తరుపున ముంబాయి నార్త్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రంగీళ భామ ఊర్మిళ

Urmila Matondkar to contest Lok Sabha elections : కాంగ్రెస్ భావజాలం నచ్చే తాను పార్టీలో చేరుతున్నానని చేరిక సందర్భంగా ఊర్మిళ తెలిపారు. కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసమే తాను పార్టీలోకి రాలేదని.. ఎన్నికలు అయిపోగానే పార్టీని వీడి వెళ్లిపోనని స్పష్టం చేశారు.

  • Share this:
    సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బాలీవుడ్ తార ఊర్మిళ మటోండ్కర్.. కాంగ్రెస్ పార్టీ తరుపున ముంబై నార్త్ పార్లమెంటుకు పోటీ చేయబోతున్నారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రెస్ నోట్ విడుదల చేసిన ఏఐసీసీ.. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఊర్మిళ అభ్యర్థిత్వాన్ని ధ్రువీకరించినట్టు తెలిపింది. బుధవారం ఢిల్లీలోని రాహుల్ నివాసంలో ఊర్మిళ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.

    కాంగ్రెస్ భావజాలం నచ్చే తాను పార్టీలో చేరుతున్నానని చేరిక సందర్భంగా ఊర్మిళ తెలిపారు. కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసమే తాను పార్టీలోకి రాలేదని.. ఎన్నికలు అయిపోగానే పార్టీని వీడి వెళ్లిపోనని స్పష్టం చేశారు. గాంధీ, నెహ్రూల భావజాలాన్ని తాను చదివానని, తన కుటుంబం కూడా కాంగ్రెస్ భావజాలాన్నే ఫాలో అవుతుందని తెలిపారు. ఇక మోదీ గురించి ప్రస్తావిస్తూ.. వ్యక్తిగతంగా ఆయన మంచివారే గానీ ఆయన ప్రవేశపెట్టిన పథకాలు మాత్రం బాగా లేవన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజల తరుపున మాట్లాడటానికి ఇప్పుడు తనకొక వేదిక దొరికిందని చెప్పారు.




    (ఊర్మిళ అభ్యర్థిత్వాన్ని ధ్రువీకరిస్తూ ఏఐసీసీ ప్రెస్ నోట్)
    First published:March 29, 2019, 11:56 IST