ఉత్తరప్రదేశ్ లోని గంగా నదిలో ప్రతి పుష్కరానికి జరిగే కుంభమేళా పై లోకసభ మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు ఉదిత్ రాజ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన మాట్లాడుతూ... ‘మతపరమైన బోధనలు, ఆచారాలకు ప్రభుత్వాలు నిధులు సమకూర్చవు. రాష్ట్రానికి సొంత మతమంటూ ఏదీ లేదు. అలహాబాద్ లో యూపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన కుంభమేళా లో రూ. 4,200 కోట్లు ఖర్చు చేశఆరు. అది కూడా తప్పు’అని వ్యాఖ్యానించారు.
దీనికి హిందూత్వ సంస్థలు, హిందూ సంఘాల నాయకులే గాక బీజేపీ కూడా ధీటుగానే స్పందించింది. కొంతమందికి ఆలోచనలు, సంకల్పం ఉండదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. కుంభమేళా అనేది ఇప్పుడు ఒక ఉత్తరప్రదేశ్ కు సంబంధించిన విషయం కాదనీ, ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది వచ్చి అక్కడ దర్శనం చేసుకుంటారని అన్నారు. అటువంటి వేడుకలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండాఉండాలంటే అక్కడ మౌలిక సదుపాయాల కల్పన చేయాలని తెలిపారు.

ప్రతీకాత్మక చిత్రం
ఇక ఇదే విషయమై యూపీ మంత్రి బ్రిజేశ్ పాటక్ మాట్లాడుతూ.. కుంభ్ అనేది ఇప్పుడు ప్రపంచ పండుగ అనీ, దాని మీద వ్యాఖ్యలు చేయడం తగదని సూచించారు.
అసోంలో ఇకనుంచి మదరసాలలో బోధించే ఖురాన్ బోధనకు ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేయబోమని ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి హిమాంత్ బిశ్వాస్ శర్మ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఉదిత్ రాజ్ వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముస్లిం గ్రంథమైన ఖురాన్ బోధనకు ప్రభుత్వ ఖర్చు ఉపయోగిస్తే.. భగవద్గీత, బైబిల్ బోధనలకు కూడా ఉపయోగించాలి. ఇందులో ఏకరూపతను తీసుకురావడానికే ఖురాన్ బోధనకు నగదును నిలిపివేస్తున్నామని ఆయన తెలిపారు. దీనిపై అసోంలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
Published by:Srinivas Munigala
First published:October 15, 2020, 15:39 IST