సీఎం జగన్‌కు చెప్పు చూపించిన కాంగ్రెస్ నాయకురాలు

ఏపీ మహిళా కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ... సీఎం జగన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: December 30, 2019, 12:47 PM IST
సీఎం జగన్‌కు చెప్పు చూపించిన కాంగ్రెస్ నాయకురాలు
సుంకర పద్మశ్రీ
  • Share this:
అమరావతి రైతుల ఆందోళనకు మద్దతు తెలిపిన ఏపీ కాంగ్రెస్ మహిళా నాయకురాలు సుంకర పద్మశ్రీ సీఎం జగన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తుళ్లూరులో జరిగిన రైతుల ఆందోళన దీక్షకు సంఘీభావం ప్రకటించిన సుంకర పద్మశ్రీ... చెప్పుదెబ్బలు తింటావ్ జగన్మొహన్ రెడ్డీ అంటూ చెప్పు చూపించి ఆయనను హెచ్చరించారు. ఆందోళన చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అన్న అంబటి రాంబాబును ఆమె పిచ్చి కుక్కతో పోల్చారు. అర్థరాత్రి అరెస్ట్ చేయడానికి రైతులు జగన్‌ తరహాలో జైలుకు వెళ్లలేదని అన్నారు. ఏపీ డీజీపీ సీఎం జగన్‌కు చెంచాగిరి చేస్తున్నారని మండిపడ్డారు.

మహిళలతో పెట్టుకోవద్దని ఆమె సీఎం జగన్‌ను హెచ్చరించారు. ఎమ్మెల్యే శ్రీదేవి బ్యూటీ పార్లర్‌లో ఉందని ఇక్కడి మహిళలు అంటే వారిపై కేసులు పెట్టారని సుంకర పద్మశ్రీ మండిపడ్డారు. కేసులు పెడితే తాము భయపడబోమని అన్నారు.

Published by: Kishore Akkaladevi
First published: December 30, 2019, 12:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading