హరీష్ రావుకు చెడ్డ పేరు తెచ్చేందుకే ఆర్థిక మంత్రి పదవి.. కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు..

రాష్ట్రంలో 50 శాతం మంది రైతులకు రైతు బంధు అందలేదని, ఒక్క రైతుకు కూడా టీఆర్‌ఎస్ సర్కారు రుణమాఫీ చేయలేదని.. దాని వల్ల ప్రజల నుంచి ఎదురయ్యే అసహనాన్ని హరీష్ రావుపై నెట్టేందుకే ఆయనకు ఆ మంత్రి పదవి ఇచ్చారని కాంగ్రెస్ నేత సంపత్ ఆరోపించారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 24, 2019, 5:25 PM IST
హరీష్ రావుకు చెడ్డ పేరు తెచ్చేందుకే ఆర్థిక మంత్రి పదవి.. కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు..
కాంగ్రెస్ నేత సంపత్, ఆర్థిక మంత్రి హరీష్ రావు
  • Share this:
హరీష్‌ రావుకు చెడ్డ పేరు తెచ్చేందుకే ఆయనకు ఆర్థిక మంత్రి పదవి కట్టబెట్టారని కాంగ్రెస్ నేత సంపత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 50 శాతం మంది రైతులకు రైతు బంధు అందలేదని, ఒక్క రైతుకు కూడా టీఆర్‌ఎస్ సర్కారు రుణమాఫీ చేయలేదని.. దాని వల్ల ప్రజల నుంచి ఎదురయ్యే అసహనాన్ని హరీష్ రావుపై నెట్టేందుకే ఆయనకు ఆ మంత్రి పదవి ఇచ్చారని ఆరోపించారు. కేసీఆర్ సర్కారు రైతుల సమస్యల పరిష్కారంపై ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. రైతుబంధు, రుణమాఫీ జరగక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. యూరియా అందుబాటులో లేక అన్నదాతలు సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు.

హుజూర్‌నగర్‌లో గెలిచేందుకు అక్కడ ప్రభుత్వం రుణమాఫీ, రైతుబంధు ఇస్తోందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ తుంగలో తొక్కారని సంపత్ దుయ్యబట్టారు.
First published: September 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading