రేవంత్‌పై భగ్గుమన్న కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే..

సంపత్ వ్యాఖ్యలకు కుంతియా అడ్డుపడి.. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. యురేనియం తవ్వకాలపై ఇప్పటికే ఢిల్లీలో సంబంధిత అధికారులను కలిసి అభ్యంతరాలు వ్యక్తం చేశామని, సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ లేఖ కూడా రాశారని చెప్పుకొచ్చారు.

news18-telugu
Updated: September 18, 2019, 7:18 AM IST
రేవంత్‌పై భగ్గుమన్న కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే..
రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)
  • Share this:
నల్లమలలో యురేనియం తవ్వకాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు రేవంత్, మాజీ ఎంపీ వీహెచ్‌ హాజరయ్యారు. అయితే రాజకీయంగా ఏమాత్రం బలం లేని పవన్ కల్యాణ్ పిలిస్తే కాంగ్రెస్ నేతలు వెళ్లడమేంటని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ వీరిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

పవన్ ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్లి.. 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ బలంతో ఆయన్ను హీరోను చేశారని విమర్శించారు. రాజకీయంగా తెలంగాణలో అసలేమాత్రం ప్రభావం లేని పవన్ ముందు కూర్చొని.. కాంగ్రెస్ నేతలు చర్చలు జరపడమేంటని మండిపడ్డారు. అసలు యురేనియం తవ్వకాలకు పవన్‌కు సంబంధమేంటని ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జ్ ఆర్సీ కుంతియా అధ్యక్షతన జరిగిన టీపీసీసీ సమావేశంలో సంపత్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే సంపత్ వ్యాఖ్యలకు కుంతియా అడ్డుపడి.. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. యురేనియం తవ్వకాలపై ఇప్పటికే ఢిల్లీలో సంబంధిత అధికారులను కలిసి అభ్యంతరాలు వ్యక్తం చేశామని, సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ లేఖ కూడా రాశారని చెప్పుకొచ్చారు.

First published: September 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...