హుజూర్ నగర్ పోరు... రేవంత్ రెడ్డి వ్యూహం ఏమిటి ?

టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కు షోకాజ్ నోటీసు ఇవ్వాలని ఇటీవల కుంతియాకు ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి... హుజూర్ నగర్‌లో కాంగ్రెస్ తరపున చామల కిరణ్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని ప్రతిపాదించారు.

news18-telugu
Updated: September 23, 2019, 1:29 PM IST
హుజూర్ నగర్ పోరు... రేవంత్ రెడ్డి వ్యూహం ఏమిటి ?
రేవంత్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణలో హుజూర్ నగర్ ఉప పోరుకు తెరలేచింది. ఈ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ కూడా విడుదల కావడంతో... అన్ని పార్టీలు తమ అభ్యర్థులతో నామినేషన్ వేయించేందుకు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ తరపున ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య, మాజీ ఎమ్మెల్యే పద్మావతి ఇక్కడి నుంచి పోటీ చేయడం దాదాపు లాంఛనమే. ఇక టీఆర్ఎస్ తరపున సైదిరెడ్డి బరిలో ఉండనున్నారు. బీజేపీ తరపున ఎవరు రేసులో ఉంటారన్నది తేలాల్సి ఉంది. ప్రధాన పార్టీలు హుజూర్ నగర్‌లో ఎవరిని బరిలో నిలుపుతాయనే విషయం అటుంచితే... కాంగ్రెస్‌లో రెబల్‌గా మారుతున్న రేవంత్ రెడ్డి హుజూర్ నగర్ ఉప ఎన్నిక విషయంలో ఎలాంటి వ్యూహం అనుసరిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కు షోకాజ్ నోటీసు ఇవ్వాలని ఇటీవల కుంతియాకు ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి... హుజూర్ నగర్‌లో కాంగ్రెస్ తరపున చామల కిరణ్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని ప్రతిపాదించారు. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ వర్గాలను టెన్షన్ పెడుతోంది. కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ సతీమణి పద్మావతికి టికెట్ ఇవ్వడం దాదాపు ఖాయం కావడంతో... రేవంత్ రెడ్డి ఆమెకు పోటీగా కిరణ్ రెడ్డి అనే వ్యక్తిగా ఇండిపెండెంట్‌గా బరిలోకి దింపుతారా అనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది.

ఒకవేళ కాంగ్రెస్ పార్టీని వీడాలని రేవంత్ రెడ్డి బలంగా నిర్ణయించుకుంటే ఈ రకమైన నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బీజేపీ శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను అభ్యర్థిగా ప్రకటిస్తే... కాంగ్రెస్‌లో ఉన్న రేవంత్ రెడ్డి ఆమెకు మద్దతు ఇస్తారా అనే సందేహాలు కూడా నెలకొన్నాయి. మొత్తానికి టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ టార్గెట్‌గా రాజకీయాలు మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి... హుజూర్ నగర్ విషయంలో ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతారా అన్నది ఉత్కంఠ రేపుతోంది.
Published by: Kishore Akkaladevi
First published: September 23, 2019, 1:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading