కూతురికి పదవి.. దిగజారుతున్న కేసీఆర్.. మండిపడ్డ రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి, కేసీఆర్

Revanth Reddy: కూతురు గెలుపు కోసం సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు.

  • Share this:
    నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగంపై కాంగ్రెస్ ముఖ్యనేత, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి, విప్ గంప గోవర్ధన్‌పై ఈసీ చర్యలు తీసుకోవాలని రేవంత్‌రెడ్డి కోరారు. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ సహా పలువురు నేతలు ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. కూతురు గెలుపు కోసం సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. భయపెట్టి ప్రజాప్రతినిధులకు టీఆర్‌ఎస్‌ కండువాలు కప్పుతున్నారని ఆయన ఆరోపించారు.

    కానిస్టేబుల్‌ దయాకర్ రెడ్డి కరోనాతో మరణిస్తే అనాధలా దహనం చేశారని విమర్శించారు. రాష్ట్ర హోంమంత్రి కనీసం కానిస్టేబుల్‌ కుటుంబాన్ని పరామర్శించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. కరోనాతో చనిపోయిన కానిస్టేబుల్‌ కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. తన కూతురు కవితను దొడ్డిదారిన ఎమ్మెల్సీ చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నిజామాబాద్‌లో ప్రజాస్వామ్యాన్ని బతికించాలని కాంగ్రెస్ నేతలు ఈసీకి విజ్ఞప్తి చేశారు.

    Published by:Kishore Akkaladevi
    First published: