గవర్నర్‌ను కలిసిన రేవంత్ రెడ్డి... ఆల్ ది బెస్ట్ చెప్పిన నరసింహన్

గవర్నర్ నరసింహన్‌ను రాజ్‌ భవన్‌లో కలిసిన రేవంత్ రెడ్డి... ఆయనకు వీడ్కోలు తెలిపారు.

news18-telugu
Updated: September 5, 2019, 2:56 PM IST
గవర్నర్‌ను కలిసిన రేవంత్ రెడ్డి... ఆల్ ది బెస్ట్ చెప్పిన నరసింహన్
నరసింహన్‌ను కలిసిన రేవంత్ రెడ్డి
  • Share this:
త్వరలోనే తెలంగాణ గవర్నర్‌గా పదవీ విరమణ చేయబోతున్న ఈఎస్ఎల్ నరసింహన్‌ను కాంగ్రెస్ ముఖ్యనేత, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా నరసింహన్‌తో కాసేపు సమావేశమయ్యారు. గవర్నర్‌గా తెలుగు రాష్ట్రాలకు నరసింహన్ చేసిన సేవలను రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన పలు అంశాలను రేవంత్ రెడ్డి గవర్నర్ నరసింహన్’తో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా నరసింహన్ రేవంత్ రెడ్డికి పలు సూచనలు చేశారని సమాచారం. తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డికి మంచి భవిష్యత్తు ఉందన్న నరసింహన్...ఆయనకు ఆల్ ది బెస్ట్ చెప్పినట్టు టాక్. ఇటీవల ఆగస్టు 15 సందర్భంగా జరిగిన ఎట్ హోం కార్యక్రమంలోనూ రేవంత్ రెడ్డిని అప్యాయంగా పలకరించిన నరసింహన్... ఆయనతో కొద్దిసేపు ముచ్చటించారు.
Published by: Kishore Akkaladevi
First published: September 5, 2019, 2:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading