హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రభుత్వ పనితీరుకు రెఫరెండమని కాంగ్రెస్ ముఖ్యనేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: September 23, 2019, 7:25 PM IST
హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ద్వారా తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త మార్పు రావాలని కాంగ్రెస్ ముఖ్యనేత, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. పెద్దపల్లిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి... సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని విమర్శించారు. కేసీఆర్ చర్యల వల్ల పుట్టబోయే బిడ్డపై కూడా లక్ష రూపాయల భారం పడుతుందని ఆయన ఆరోపించారు. రూ.16వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పగిస్తే.. కేసీఆర్ తెలంగాణను అప్పులపాలు చేశారని ధ్వజమెత్తారు.

ప్రభుత్వ దుబారా వ్యయాన్ని కాగ్ నివేదిక కూడా తప్పుపట్టిందని రేవంత్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇప్పుడు ఇంకా అప్పులు చేస్తానంటూ కేసీఆర్ బరితెగించి మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రభుత్వ పనితీరుకు రెఫరెండమని ఆయన అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేతిలో మోసపోయిన విద్యార్థులు, కార్మికులు, ఇతర వర్గాలన్నీ హుజూర్ నగర్‌లో ప్రచారం చేయాలని ఆయన కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.






First published: September 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading