కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి హఠాన్మరణం

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధైన రాజీవ్ త్యాగి ఇక లేరన్న వార్తవిని పార్టీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి.

news18-telugu
Updated: August 12, 2020, 9:24 PM IST
కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి హఠాన్మరణం
రాజీవ్ త్యాగి
  • Share this:
కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండెపోటుతో కన్నుమూశారు. ఘజియాబాద్‌లోని తన నివాసంలో బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన ఆకస్మిక మరణం పట్ల కాంగ్రెస్ నేతలు, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్, బీజేపీ నేత సంబిత్ పాత్రాతో పాటు పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధైన రాజీవ్ త్యాగి ఇక లేరన్న వార్తవిని పార్టీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి.

'రాజీవ్ త్యాగి హఠాత్తుగా మరణించినందుకు మేం చాలా బాధ‌ప‌డుతున్నాం. బలమైన కాంగ్రెస్ నేత‌, నిజమైన దేశభక్తుడిని కోల్పోయాం. ఆయన కుటుంబ‌స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాం. పార్టీ తరపు అన్ని విధాలా అండగా ఉంటాం.' అని కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విటర్ హ్యాండిల్ పేర్కొంది.


కాగా, గత ఏడాది అక్టోబర్‌లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆయనను ఉత్తర ప్రదేశ్‌ కాంగ్రెస్ మీడియా ఇన్‌చార్జిగా నియమించారు. రాజీవ్ త్యాగి కాంగ్రెస్ జాతీయ ప్రతినిధితో పాటు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల సమయంలోనూ ఆయ‌న కీల‌కంగా ప‌నిచేశారు.
Published by: Shiva Kumar Addula
First published: August 12, 2020, 9:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading