• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • CONGRESS LEADER RAJIV SHUKLA SAYS 6 SURGICAL STRIKES CONDUCTED DURING UPA REGIME PROVIDES DATES BA

యూపీఏ హయాంలో ఆరు సర్జికల్ స్ట్రైక్స్.. తేదీలు, ప్లేస్‌లు చెప్పిన కాంగ్రెస్ నేత

యూపీఏ హయాంలో ఆరు సర్జికల్ స్ట్రైక్స్.. తేదీలు, ప్లేస్‌లు చెప్పిన కాంగ్రెస్ నేత

రాజీవ్ శుక్లా (PTI)

యూపీఏ హయాంలోనూ పలుమార్లు సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని కాంగ్రెస్ నేతలు వాదించారు. ఇప్పుడు రాజీవ్ శుక్లా తేదీలతో సహా చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

  • Share this:
    కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ హయాంలో కూడా ఆరు సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని కాంగ్రెస్ సీనియర్ నేత రాజీవ్ శుక్లా ప్రకటించారు. ఎప్పుడెప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయనే తేదీలను కూడా ఆయన వెల్లడించారు. ఢిల్లీలో రాజీశ్ శుక్లా మీడియాతో మాట్లాడారు.‘వాజ్‌పేయి హయాంలో రెండుసార్లు సర్జికల్ స్ట్రైక్స జరిగాయి. యూపీఏ పాలనలో ఆరుసార్లు సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించాం. మేం ఎప్పుడూ ఛాతీ విరుచుకుని చెప్పలేదు. ఒక్క సర్జికల్ స్ట్రైక్ చేసిన వ్యక్తి ఏదో గొప్పలు చెబుతున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ మీద వాజ్‌పేయి కానీ, మన్మోహన్ సింగ్ కానీ ఎక్కడా గొప్పలు చెప్పలేదు.’ అని రాజీవ్ శుక్లా అన్నారు. 1999 నుంచి 2004 మధ్య కాలంలో వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్నారు. 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ ప్రధానిగా సేవలు అందించారు.

    రాజీవ్ శుక్లా చెప్పిన తేదీలు.. ప్లేస్‌లు

    2008 జూన్ 19: జమ్మూకాశ్మీర్‌లోని భట్టాల్ సెక్టార్
    2011 ఆగస్ట్ 30 - సెప్టెంబర్ 1: నీలం రివర్ వ్యాలీ శారద సెక్టార్లో
    2013 జూన్ 6: సావన్ పాత్రా చెక్‌పోస్ట్
    2013 జూలై 27-28: నాజాపిర్ సెక్టార్
    2013 ఆగస్ట్ 6: నీలమ్ వ్యాలీ
    2014 జనవరి 14న ఆరో సర్జికల్ స్ట్రైక్

    వాజ్‌పేయి హయాంలో ఎప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయో చెప్పిన శుక్లా
    2000 జనవరి 21: నీలం నది సమీపంలోని నాదాల ఎన్‌క్లేవ్
    2003 సెప్టెంబర్ 18: పూంఛ్‌లోని బరోహ్ సెక్టార్‌లో

    గతంలో ఎన్నోసార్లు అవకాశం వచ్చినా కాంగ్రెస్ సర్జికల్ స్ట్రైక్స్ చేయలేకపోయిందని, ఉగ్రవాదంపై మెతక వైఖరి అవలంభించిందంటూ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈక్రమంలో యూపీఏ హయాంలోనూ పలుమార్లు సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని కాంగ్రెస్ నేతలు వాదించారు. ఇప్పుడు రాజీవ్ శుక్లా తేదీలతో సహా చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు