Home /News /politics /

CONGRESS LEADER RAHUL GANDHI HAS TWEETED THAT THE BJP WILL INCREASE FUEL PRICES AFTER THE ELECTIONS SNR

BJP vs CONGRESS:ఉక్రెయిన్‌లో ఆ యుద్దం..భారత్‌లో ఈ యుద్ధం ఎవ్వరూ తగ్గట్లేదుగా..

( BJP vs CONGRESS )

( BJP vs CONGRESS )

BJP vs CONGRESS: దేశంలో విపక్ష పార్టీలు యుద్ధాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నాయని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ విమర్శలు ఎక్కుపెట్టింది. అసెంబ్లీ ఎన్నికలవగానే పెట్రోల్, డీజిల్ పెంచడం ఖాయమని ఆపార్టీ ఎంపీ రాహుల్‌గాంధీ ట్వీట్ చేశారు. అంతే కాదు ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని బూచిగా చూపించి ప్రజలపై అధికభారం మోపాలనే ఎత్తుగడ వేస్తోందని కాంగ్రెస్‌ పార్టీ సైతం ట్వీట్‌లు చేస్తోంది.

ఇంకా చదవండి ...
ఉక్రెయిన్‌(Ukraine),రష్యా (Russia)మధ్య యుద్ధం తరహాలోనే భారత్‌లో కాంగ్రెస్(Congress), బీజేపీ (bjp) మధ్య డైలాగ్‌ వార్‌ కొనసాగుతోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ రేపటితో ముగియనుంది. ఈనేపధ్యంలో కాంగ్రెస్‌, బీజేపీ ఒకరి పార్టీలు ఒకదానిపై మరొకటి విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ, రాహుల్‌గాంధీ (Rahul Gandhi)ట్విట్టర్ (Twitter)వేదికగా బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ప్రజలకు ఓ ట్వీట్ చేశారు. రాహుల్‌గాంధీ ట్వీట్‌ పరమార్ధం ఏమిటంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం త్వరలోనే పెట్రోల్(Petrol), డీజిల్ (Diesel)ధరలు పెంచనుంది. అందుకే అందరూ త్వరపడండి వెంటనే మీ వాహనాలు ట్యాంక్ ఫుల్ చేయించుకోమంటూ సూచిస్తూనే పెట్రోల్‌ బంక్‌ ఇమేజ్‌ని పోస్ట్ చేశారు. దాని కింద వెంటనే పెట్రోల్‌ ట్యాంక్ నిండుగా పెట్టండి మోదీ సర్కారు ఎన్నికల ఆఫర్ ముగియనుంది అంటూ సెటైరికల్‌ కామెంట్‌ని ట్యాగ్‌లైన్‌లా రాశారు రాహుల్‌గాంధీ. ఇంధన ధరల్ని ఇష్టారాజ్యంగా పెంచేసిన తర్వాత యుద్ధాన్ని బూచిగా చూపించాలన్న ఆలోచనలో బీజేపీ ప్రభుత్వం ఉందంటూ కాంగ్రెస్‌ పార్టీ నేతలు సైతం కేంద్ర ప్రభుత్వంపై సెటైర్లు వేస్తున్నారు. రాహుల్‌గాంధీ ట్వీట్లకు అనుగూణంగానే వేర్వేరుగా ట్వీట్‌లు చేస్తున్నారు. అంతే కాదు లోటస్‌ డోన్ట్‌ లూట్‌ అజ్‌( lotus dont loot aaj) అనే హ్యాష్‌ ట్యాగ్‌పై కాంగ్రెస్‌ పార్టీ తన ట్వీట్‌ని పోస్ట్ చేసింది. దేశంలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు ముగియ‌గానే.. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను భారీగా పెంచే దిశ‌గా మోదీ స‌ర్కారు రంగం సిద్ధం చేసిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారాన్ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్‌ కేంద్రంపై ముందు నుంచే ఈ తరహాలో విమర్శలు ఎక్కుపెడుతోంది. ఉక్రెయిన్‌, ర‌ష్యాల మ‌ధ్య నెల‌కొన్న యుద్ధం కార‌ణంగా ముడి చ‌మురు ధ‌ర‌లు భారీగా పెరిగిన కార‌ణాన్ని చూపుతూ విడ‌త‌ల‌వారీగా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచేందుకు మోదీ స‌ర్కారు ఓ నిర్ణ‌యం తీసుకున్నట్లుగా వస్తున్న వార్తలు వస్తున్న నేపధ్యంలోనే రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ చేసిన ట్వీట్లు వైర‌ల్‌గా మారాయి.

కమలం, కాంగ్రెస్‌ పరస్పర విమర్శలు..
బీజేపీ కూడా కాంగ్రెస్‌ చేస్తున్న విమర్శలకు ధీటుగానే కౌంటర్ ఇస్తోంది. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధంలో చిక్కుకున్న భారతీయ విద్యార్ధుల్ని సురక్షితంగా రప్పించే ప్రయత్నం కేంద్రం చేస్తుంటే విపక్షాలు యుద్ధాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసమే వాడుకుంటున్నాయని స్వయంగా ప్రధాన నరేంద్ర మోదీ కామెంట్ చేశారు. ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్‌ జరగనున్న నేపధ్యంలో చేసిన ఎన్నికల ప్రచారంలో అటు కాంగ్రెస్‌ని, ఇటు సమాజ్‌వాది పార్టీని నమ్మడానికి వీల్లేదని..వాళ్లకు ప్రజలు, దేశ సౌఖ్యం అవసరం లేదని ఎద్దేవా చేశారు.

అధికార,ప్రతిపక్షం మధ్య యుద్ధం..
ఉప్పు నిప్పులా పేలుతున్నాయి కాంగ్రెస్‌, బీజేపీ మధ్య ప్రతివిమర్శలు. మార్చి7తో ఎన్నికలు ముగియగానే దేశంలో ఇంధన ధరలు పెరిగితే మేం ముందు నుంచే చెబుతున్నాం..బీజేపీ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓట్ల కోసమే ధరల తగ్గించినట్లు నమ్మించి ఇప్పుడు పెంచిందంటూ కాంగ్రెస్‌ కొత్త రాగం అందుకోవాలని చూస్తున్నట్లుగా రాహుల్‌ ట్వీట్‌తో అర్ధమవుతోంది. మరోవైపు బీజేపీ కూడా ఇంధన ధరలు పెంచినా పెంచకపోయినా దేశం కోసం దేశ ప్రజల కోసం యుద్ధం జరుగుతున్న దేశాల నుంచి ప్రజల్ని కాపాడింది బీజేపీ ప్రభుత్వమేననే క్రెడిట్‌ని చాటుకోవాలని చూస్తోంది.
Published by:Siva Nanduri
First published:

Tags: Bjp, Congress, Narendra modi, Rahul Gandhi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు