Rahul Gandhi fires: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఫేస్ బుక్ (Facebook) పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. సామాజిక మాధ్యమాలు.. ప్రజాస్వామ్యాన్ని అధ్వాన్నంగా మారుస్తున్నాయన్నారు. ఈ రోజు రాహుల్ గాంధీ తన ట్విటర్ ఖాతా (Twitter Account) వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు. ఫేస్ బుక్ ప్రధానంగా అసత్య నివేదికలను ప్రచారం చేస్తుందని మండిపడ్డారు . అదే విధంగా, ఎన్నికల ఫలితాల నివేదికలలో.. కూడా పలు అసత్య క్యాంపెయినింగ్ చేసిందని ఆరోపించారు. ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి ఫేస్ బుక్.. తక్కువ ధరలకు ప్రకటనలు ఇస్తుందని అన్నారు.
అల్ జజీరా, రాయటర్స్ ఇతర నివేదికల ప్రకారం.. బీజేపీకి ఫేస్ బుక్ తక్కువ ధరలకు ప్రకటనలను ఆఫర్ చేసిందని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా.. దేశంలో మితిమీరిన అసత్య ప్రచారాలు వైరల్ అవుతున్నాయని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇవి ప్రజాస్వామ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయన్నారు.
అదే విధంగా పక్షపాత రాజకీయాలకు తెరదీస్తున్నారని ఆరోపించారు. కొన్ని రాజకీయ పార్టీలకు కొమ్ము కాస్తు, వాటికి అనుగుణంగా, నివేదికలు ఇస్తున్నాయని విమర్శించారు. అదే విధంగా లేనివి.. ఉన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. దీని వలన ప్రజలు తప్పుదొవ పడుతున్నారని అన్నారు. ప్రజాస్వామ్యం (Democracy) అపహాస్యం పాలవుతుందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికారం అనేది శాశ్వతం కాదని రాహుల్ గాంధీ అన్నారు. ఎవరు అధికారంలో ఉన్న.. ప్రజాస్వామ్యాన్ని, సామాజిక సామరస్యాన్ని కాపాడు కోవాలని హితవు పలికారు.
సామాజిక మాధ్యమాలు.. కొన్ని అంశాల మీద నియంత్రణ పాటించాలన్నారు. గతంలోనే రాహుల్ గాంధీ సోషల్ మీడియాపై (Social Media) మండిపడ్డారు. ఆయన ఫాలోవర్స్ తగ్గిపోవడం వెనుక ఏదో కుట్ర ఉందన్నారు. అదే విధంగా కొత్త యూజర్స్ ని.. కాంగ్రెస్ పార్టీ దగ్గరకు చేరకుండా అసత్య ప్రచారాలు (Fake Campaigns) చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ కొత్త, పాత యూజర్స్ లను తొలగిస్తున్నారని కూడా ఆరోపించారు. దీంతో ఈ వ్యవహరం మరోసారి వార్తలలో నిలిచింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.