ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని గోరఖ్ పూర్లో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) బీజేపీపై ధ్వజమెత్తారు. ఇందిరాగాంధీ (Indira Gandhi) వర్ధంతి సందర్భంగా ప్రతిజ్ఞా ర్యాలీకి హాజరయ్యారు ప్రియాంకా. భాజపా (BJP) పాలనపై నిప్పులు చెరిగారు. అధిక ధరలతో ప్రజలు అల్లాడిపోతుంటే అటు కేంద్ర , ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని ప్రియాంకా మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రజల కష్టాలను సీఎం యోగి ఆదిత్యానాథ్ (Yogi Aditya nath) పట్టించుకోవడం లేదన్నారు. ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలు (law and orders) అద్భుతంగా ఉన్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Union Home minister Amit shah) ప్రశంసిస్తున్నారని, కాని, ఆయన పక్కనే మంత్రి అజయ్ మిశ్రా (Ajay Mishra) లాంటి వారు ఉన్న విషయాన్ని మర్చిపోయారని ప్రియాంక మండిపడ్డారు. రైతులను తన కొడుకు.. కాన్వాయ్‌తో తొక్కించినా కేంద్ర మంత్రి స్వేచ్చగా తిరుగుతున్నారని ప్రియాంక విమర్శించారు.
70 ఏళ్లలో చేసింది 7 ఏళ్లలో వృథా..
దేశంలో రైల్వేలు (Railways), విమానాశ్రయాలు, రోడ్లు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ అని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు. వాటన్నింటినీ బీజేపీ (BJP) పాలకులు అమ్ముతున్నారని (selling) ఆమె మండిపడ్డారు. 70 ఏళ్లలో ఏం చేశామని అడుగుతున్నారని, 70 ఏళ్ల శ్రమను కేవలం 7 ఏళ్లలో వృథా చేశారని ఆమె విమర్శలు గుప్పించారు. ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ.. “ రైల్వేలు, విమానాశ్రయాలు, రోడ్లు ఏర్పాటు చేసింది కాంగ్రెస్. వాటన్నింటినీ అమ్ముతున్నారు. 70 ఏళ్లలో ఏం చేశామని అడుగుతున్నారు. 70 ఏళ్ల శ్రమను కేవలం 7 ఏళ్లలో వృధా చేశారు... యూపీలో 5 కోట్ల మంది నిరుద్యోగ యువత ఉన్నారు. నిరుద్యోగంతో రోజుకు ముగ్గురు యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు”అని అన్నారు.
యూపీలో కాంగ్రెస్ పార్టీనే పోరాటం..
యూపీలో సమాజ్‌వాదీ పార్టీ (SP), బీఎస్పీ (BSP) లాంటి విపక్ష పార్టీలు ప్రజా సమస్యలపై పోరాటంలో విఫలమయ్యాయని ప్రియాంక విమర్శించారు.
#WATCH | They (SP & BSP) say Congress is working in collusion with BJP. I want to ask: why don't they stand with you in your tough times. Only Congress is fighting. I will die but never have any kind of relationship with BJP: Congress leader Priyanka Gandhi in Gorakhpur pic.twitter.com/BlyfmK63Zm
బీజేపీకి తొత్తుగా మారిందని ఆ పార్టీలు విమర్శిస్తున్నాయని, కానీ, ప్రతి అంశంపై యూపీలో కాంగ్రెస్ పార్టీనే పోరాడుతోందని (fighting) ప్రియాంక అన్నారు. తన ప్రాణం పోయినా సరే బీజేపీతో కలిసి పనిచేసే ప్రసక్తే ఉండదన్నారు ప్రియాంకా గాంధీ.
#WATCH | She (ex-PM Indira Gandhi) knew that she could be murdered but never bowed down because for her, there was nothing greater than your faith in her. It's because of her teachings that I'm standing in front of you & I'll also never break your faith: Priyanka Gandhi, Congress pic.twitter.com/qR8rmTFwer
‘‘ఆమె (మాజీ ప్రధాని ఇందిరా గాంధీ) హత్యకు గురికావచ్చని తెలుసు, కానీ ఆమెపై మీ విశ్వాసం కంటే గొప్పది ఏం లేదు. కాబట్టి ఆమె ఎప్పుడూ తలవంచలేదు. ఆమె బోధనల వల్లే నేను మీ ముందు నిలబడ్డాను, మీ విశ్వాసాన్ని ఎప్పటికీ బ్రేక్ చేయను” అన్నారు ప్రియాంక గాంధీ.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.