CONGRESS LEADER PRIYANKA GANDHI GREETS BJP SUPPORTERS WITH ALL THE BEST BS
షాకింగ్: బీజేపీ నేతలకు ఆల్ ది బెస్ట్ చెప్పిన ప్రియాంక గాంధీ.. ఆశ్చర్యంతో..
ప్రియాంక గాంధీ (ఫైల్)
ఓ చోట రహదారిపై కొందరు బీజేపీ, మోదీ మద్దతుదారులు మోదీ.. మోదీ.. అంటూ నినాదాలు చేశారు. వారిని చూసిన ప్రియాంక తన కాన్వాయ్‌ని ఆపించారు. నల్ల రంగు సఫారీలో నుంచి దిగిన ఆమె నేరుగా ఆ యువకుల వద్దకు వెళ్లి కరచాలనం చేస్తూ.. ‘మీరక్కడ.. నేనిక్కడ.. ఆల్ ది బెస్ట్’ అని చెప్పారు.
కాంగ్రెస్, బీజేపీ.. ఎన్నికల్లో నువ్వా? నేనా? అన్నట్లు తలపడుతున్నాయి. అలాంటిది మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో అద్భుత సన్నివేశం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి ఇండోర్ విమానాశ్రయం నుంచి కాన్వాయ్‌లో ప్రచారానికి వెళ్తుండగా.. ఓ చోట రహదారిపై కొందరు బీజేపీ, మోదీ మద్దతుదారులు మోదీ.. మోదీ.. అంటూ నినాదాలు చేశారు. వారిని చూసిన ప్రియాంక తన కాన్వాయ్‌ని ఆపించారు. నల్ల రంగు సఫారీలో నుంచి దిగిన ఆమె నేరుగా ఆ యువకుల వద్దకు వెళ్లి కరచాలనం చేస్తూ.. ‘మీరక్కడ.. నేనిక్కడ.. ఆల్ ది బెస్ట్’ అని చెప్పారు. ఈ అనూహ్య ఘటనతో బీజేపీ మద్దతుదారులు ఆశ్చర్యపోయారు. ప్రియాంక గాంధీకి కూడా వారు ఆల్ ది బెస్ట్ అని చెప్పారు.
అనంతరం ఆమె మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బాఘెల్‌తో కలిసి రోడ్‌షోలో పాల్గొన్నారు. అంతకుముందు ఆమె ఎన్నికల సభలో మోదీ మేఘాల వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. ఆకాశంలో మేఘాలు కమ్ముకొని ఉండటం వల్ల తాను ప్రజల రాడార్లోకి రానని మోదీ అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆయన పెద్ద రక్షణ నిపుణుడని, అందుకే ఎన్నడూ ఒక్క విమానాన్ని కూడా తయారు చేయని రిలయన్స్ సంస్థకు రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందాన్ని కట్టబెట్టారని ఆరోపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.