కల్వకుంట్ల ట్విట్టర్ రావు, కోతలరావు... కాంగ్రెస్ నేత సెటైర్లు

ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై కేటీఆర్ వెంటనే స్పందించాలని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.

news18-telugu
Updated: October 9, 2019, 5:15 PM IST
కల్వకుంట్ల ట్విట్టర్ రావు, కోతలరావు... కాంగ్రెస్ నేత సెటైర్లు
కేటీఆర్, పొన్నం ప్రభాకర్..
  • Share this:
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. కేటీఆర్ అంటే కల్వకుంట్ల తారక రామారావు కంటే కల్వకుంట్ల ట్విటర్ రావుగా బాగా ప్రచారంలోకి వచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. పలు అంశాలపై అవసరం లేకున్నా ట్విట్టర్‌లో స్పందించే కేటీఆర్... ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ఎందుకు స్పందించడం లేదని పొన్నం ప్రశ్నించారు. ఎన్నికల ముందు కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని హామీ ఇవ్వలేదా ? అని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లనే పరిష్కరించాలని కోరుతున్నారని అన్నారు.

50 వేల ఆర్టీసీ కార్మికుల బాధ మీకు కనబడడం లేదా? అని ప్రశ్నించారు. వారి ఉద్యోగాలు తొలగిస్తే వారి కుటుంబాలు రోడ్ మీదకు వస్తాయని... ఎందుకు మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం లేదని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పట్ల వెంటనే కేటీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఎన్నికల ముందు ఆర్టీసీ ఉద్యోగులకు హామీ ఇచ్చిన కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగా కాకుండా కల్వకుంట్ల కోతలరావుగా మిగిలిపోతారని అన్నారు. ఆర్టీసీ సమస్యలపై స్పందించికపోతే తెలంగాణ ప్రజల దృష్టిలో ద్రోహిగా కేటీఆర్ మిగిలిపోతారని పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులకు అండగా కాంగ్రెస్ ఉంటుందని... సమస్య పరిష్కారమయ్యే వరకు టీఆర్ఎస్‌ను నిద్రలో కూడా వెంటాడుతుందని అన్నారు.

First published: October 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading