హుజూర్‌నగర్‌లో రేపు కేసీఆర్ సభ.. ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

హైదరాబాద్‌లో రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ను కలిసిన కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీపై ఫిర్యాదు చేశారు. హుజూర్‌నగర్‌లో జరగనున్న సీఎం కేసీఆర్ సభ కోసం టీఆర్‌ఎస్‌ భారీగా ఖర్చు చేస్తోందని విమర్శించారు.

news18-telugu
Updated: October 16, 2019, 8:03 PM IST
హుజూర్‌నగర్‌లో రేపు కేసీఆర్ సభ.. ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
సీఎం కేసీఆర్ (FIle)
  • Share this:
హుజూర్ నగర్ ఉపఎన్నిక ప్రచారం తారా స్థాయికి చేరింది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్‌ని ఓడించిన కేసీఆర్‌కు బిగ్ షాక్ ఇవ్వాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుంటే.. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానంలో గెలిచి తమకు ఎదురులేదని నిరూపించుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ క్రమంలో తమ అభ్యర్థి సైదిరెడ్డికి మద్దతుగా సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. గురువారం హుజూర్‌నగర్‌లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది. సభా ఏర్పాట్లను రాష్ట్ర గిరిజన, మహిళా- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోథ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రజలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఐతే సీఎం కేసీఆర్ హుజూర్ నగర్ సభపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. హైదరాబాద్‌లో రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ను కలిసిన కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. హుజూర్‌నగర్‌లో జరగనున్న సీఎం కేసీఆర్ సభ కోసం టీఆర్‌ఎస్‌ భారీగా ఖర్చు చేస్తోందని విమర్శించారు. కేసీఆర్‌ కుటుంబానికి చెందిన మీడియాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రకటనలు వస్తున్నాయని.. ఆ ఖర్చును టీఆర్ఎస్ అభ్యర్థి ఖర్చుగానే చూడాలని ఈసీకి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. మంత్రుల ఆత్మీయ సమ్మేళనం పేరుతో కోడ్ ఉల్లంఘిస్తున్నారని.. వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు శశిధర్ రెడ్డి.

First published: October 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు