కేసీఆర్‌కు ఓటమి భయం... ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలు భద్రం... కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు

ఆర్టీసీ కార్మికుల కుటుంబాల ఉసురు కేసీఆర్‌కు తగులుతుందని మధు యాష్కీ వ్యాఖ్యానించారు. గవర్నర్ చొరవ తీసుకొని సమస్య పరిష్కరించాలని కోరారు.

news18-telugu
Updated: October 18, 2019, 12:50 PM IST
కేసీఆర్‌కు ఓటమి భయం... ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలు భద్రం... కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు
కేసీఆర్, ఆర్టీసీ
news18-telugu
Updated: October 18, 2019, 12:50 PM IST
హుజూర్ నగర్‌లో కాంగ్రెస్ పార్టీకి పోటీనే లేదని నిజామాబాద్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత మధు యాష్కీ అన్నారు. అక్కడ ఓటమి భయంతోనే కేటీఆర్ రోడ్ షోలు ,కేసీఆర్ సభ రద్దు చేసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రెండు వారాలుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటె ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలు ఎక్కడికి పోవని... వారికి రాజ్యాంగం అండగా ఉంటుందని మధు యాష్కీ అన్నారు. రాష్ర్టం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్ర ఆకాంక్షను ఆసరాగా చేసుకోని కేసీఆర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ఆర్టీసీ కార్మికుల కుటుంబాల ఉసురు కేసీఆర్‌కు తగులుతుందని వ్యాఖ్యానించారు. గవర్నర్ చొరవ తీసుకొని సమస్య పరిష్కరించాలని కోరారు. మెఘా కంపెనీకి ఆర్టీసీ ఆస్తులు కట్టబెట్టడం ఓ కుట్ర అని మధు యాష్కీ ఆరోపించారు. ప్రభుత్వంలో ఓ మంత్రి మెఘా వెనుక ఉండి నడిపిస్తున్నారని విమర్శించారు. ఆలస్యమైనా ఉద్యోగ సంఘాలు స్పందించి ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలపడం సంతోషకరమైన విషయమని అన్నారు. హైకోర్టు తీర్పు కార్మికుల పక్షాన వస్తుందని ఆశిస్తున్నామని మధు యాష్కీ అన్నారు.ఆంధ్ర ,తెలంగాణ సీఎంలు దొంగలు దొంగలు దోచుకున్నట్లుగా ఉందని... దోపిడీ కోసమే ఇరు రాష్ర్టాల సీఎంలు ఏకమయ్యారని విమర్శించారు.


First published: October 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...